కాన్సెప్ట్ ఉంటే కమర్షియాలిటీ అవసరం లేదు..!

Posted December 5, 2016

film-industry-teluguప్రపంచ సినిమాకు పోటీ పడుతున్న తెలుగు సినిమా స్టామినాను తెలుగు సినిమా దర్శక నిర్మాతలు దశ దిశలల్లా వ్యాపించ చేస్తున్నా సరే ఇంకా తెలుగు సినిమా కమర్షియల్ బాటని మాత్రం వీడటం లేదు. హీరో రేంజ్ బడ్జెట్ తో పెంచేస్తున్న దర్శక నిర్మాతలు అందులో కథా వస్తువు గురించి మాత్రం ఆలోచన చేయట్లేదు. బడ్జెట్ అయితే హద్దులు దాటి పోయాయి ఇక స్టార్ సినిమా కమర్షియల్ గా రొటీన్ కథ అయినా కాస్త రిఫ్రెష్ మెంట్ ఫీల్ అయితే హిట్ చేయక తప్పట్లేదు. అయితే ఇది ఒకపట్టి మాట ఇప్పుడు కథ.. కాన్సెప్ట్ సరిగ్గా ఉంటే అది స్టార్ సినిమా కాదు చిన్న సినిమా అయినా సరే ప్రేక్షకులు విశేష స్పందన అందిస్తున్నారు.

కమర్షియల్ బాటలో మూస థోరణిలో సినిమాలు చేస్తున్న స్టార్ హీరోల కన్నా కొత్త కథతో చిన్న ప్రయత్నం చేస్తున్న దర్శక నిర్మాతలకు సపోర్ట్ అందిస్తున్నారు ప్రేక్షకులు. ఇక ప్రేక్షకుల ఆలోచనను బట్టే హీరోలు కూడా సినిమాలు తీయాలి.. తీస్తారు కాబట్టి ఇప్పుడు స్టార్ హీరోలు కూడా మంచి కథలున్న సినిమాలే ఓకే చేస్తున్నారు. స్టార్ సినిమా అంటే రొటీన్ కథ అన్న ఆలోచన నుండి స్టార్ సినిమాలో కూడా వెరైటీ కథ ఉంటుంది అన్న రీతిలో ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తున్నారు.

వీటికి తమ మార్క్ కమర్షియల్ హంగులను అద్దడం మాత్రం మర్చిపోవట్లేదు. అవసరం ఉన్నా లేకున్నా ఐటం సాంగ్.. హీరోయిన్ తో లిప్ లాక్ సీన్స్ ఇలా కాన్సెప్ట్ మంచిదైనా ఓ వర్గం ప్రేక్షకుల ఆనందం కోసం ఇలాంటివి చేయక తప్పట్లేదు. స్టార్ సినిమాల్లో హీరోయిన్ గ్లామర్ కోసం కూడా సినిమా చూసే ఆడియెన్స్ ఉన్నారంటే నమ్మాల్సిందే. సో అలా తాము చేసేది కథ ఉన్న సినిమా అయినా సరే వారి రేంజ్ కు దానికి కమర్షియలిటీ అద్దుతూ సినిమా అవుట్ పుట్ వచ్చేలా చేస్తున్నారు స్టార్ హీరోలు.

ఇక ఇవేవి లేకుండా కొత్త హీరో అయినా సరే కొత్త దర్శకుడు అయినా సరే ఓ కొత్త ప్రయత్నంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నారు. మరి ఈ కమర్షియల్ కాన్సెప్ట్ ల కన్నా కేవలం కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకే ఎక్కువ రన్ టైం ఉందని తెలుసుకోవాల్సిన నిజం. మరి ఈ పరిస్థితులు స్టార్ హీరోలకు ఏ విధమైన కనువిప్పు కలిగిస్తాయో చూడాలి. ప్రస్తుతం స్టార్ హీరోల ఆలోచన విధానం కూడా మారింది అవతల హీరో కొత్త కథలకు ప్రిఫరెన్స్ ఇస్తూ హిట్లు అందుకుంటుంటే అదే తరహాలో వారు కూడా ఇలా ఒకరిని చూసి ఒకరు కాన్సెప్ట్ సినిమాల మీద మనసు పడుతున్నారు. టాలీవుడ్ లో కనిపిస్తున్న ఈ కొత్త ఉత్సాహానికి ప్రేక్షకులు కూడా తమ సహకారాన్ని అందిస్తారని ఆశిద్దాం.

SHARE