నాని పాటి ధైర్యం టాప్ స్టార్స్ కి లేదా?

0
1108
star heros dont have guts like nani

తెలుగు చిత్రసీమ చుట్టూ పేరుకుపోయిన కులజాడ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చూడ్డానికి ఇదంతా అభిమానుల హడావిడి మాత్రమే,హీరోలంతా బాగా కలిసిపోతారని అప్పుడప్పుడు ప్రకటనలు వస్తుంటాయి.తారలు కలుసుకునే ఫంక్షన్స్ లో కెమెరా కళ్ల ముందు నిజంగా ఇది నిజమే అనిపించేలా ఉంటుంది కూడా.కానీ అసలు వ్యవహారాలు,సంభాషణలు నడిచే చోట ఏ కెమెరాలు వుండవు.అక్కడ కూడా నటులు ఇలాగే వుంటూ …తమని కలవడానికి వచ్చే వారికి,అభిమానులమని చెప్పుకునేవాళ్ళకి ఈ కులజాడ్యం వద్దని నూరిపోయొద్దా? ఇలా ఫ్యాన్స్ కి హితవు చెప్పే ధైర్యం ఎంతమంది స్టార్ హీరోలకి వుందో తెలియదు గానీ సినిమా నటులు వేలుపెట్టడానికి భయపడే ఇలాంటి విషయాన్ని నాచురల్ స్టార్ నాని డీల్ చేసే విధానం సూపర్ గా వుంది.

ఇటీవల ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో నాని ఓ పోస్ట్ పెట్టాడు.దాని సారాశం ఏమిటంటే ” దేవుళ్ళకి తమ పుట్టిన రోజు ఎప్పుడో తెలియనప్పుడు ఈరోజు ఘనంగా దాన్ని సెలెబ్రేట్ చేసుకోవచ్చు” . ఓ రాముడు,కృష్ణుడుగా ఎన్టీఆర్ చేసిన పౌరాణిక పాత్రల్ని దృష్టిలో ఉంచుకుని నాని ఈ పోస్ట్ పెట్టాడు.కానీ ఓ వ్యక్తి నాని కులాభిమానంతోనే ఈ పోస్ట్ చేసాడని వ్యాఖ్యానించాడు.దానికి నాని ఘాటుగా జవాబు ఇచ్చాడు.’నేను మీలాగే తెలుగువాడిని.ఎన్టీఆర్ కి మాత్రమే కాదు చిరంజీవికి కూడా అభిమానిని.పెద్దలని గౌరవించే సంస్కారం ఉన్నవాడిని.” అన్న నాని సమాధానంతో ఆ వ్యక్తి షాక్ అయ్యాడు.ప్రతి విషయాన్ని కులం కళ్లద్దాలు నుంచి చూసే పైత్యం దిగిపోయిందేమో గానీ వెంటనే ఆ పోస్ట్ తీసేసాడు.

వేరే హీరోలు కూడా ముఖ్యంగా టాప్ స్టార్స్ కూడా ఇలాంటి విషయాల్లో మొహమాటాలు వదిలిపెట్టి కుండ బద్దలు కొట్టగలిగినట్టు మాట్లాడితే చాలా మందికి తాము ఏ తప్పు చేస్తున్నామో అర్ధం అవుతుంది.అలా కాకుండా అలాంటి కులాభిమానులు చెప్పేది ఇష్టమున్నా లేకున్నా వింటూ పోతే అప్పటికప్పుడు సమస్య లేకుండా పోతుందేమో గానీ డీర్ఘకాలికంగా చూస్తే సమాజాన్ని విడదీసే ఓ జాడ్యాన్ని పరోక్షంగా పెంచి పోషించినవాళ్లుగా మిగిలిపోతారు.ఆ మొహమాటాలు పక్కనబెట్టి నానిని స్ఫూర్తిగా తీసుకుంటే వెండితెరకి పట్టిన కులం బూజు దులపడం తేలికే.

Leave a Reply