కొరటాలతో స్టార్‌ హీరోలు మళ్లీ మళ్లీ

0
395
star heros interested in koratala shiva

  Posted [relativedate] at [relativetime time_format=”H:i”]


‘మిర్చి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన రచయిత కొరటాల శివ ప్రస్తుతం టాలీవుడ్‌ టాప్‌ దర్శకుల్లో ఒక్కరు. ఈయన ఇప్పటి వరకు తెరకెక్కించిన మూడు సినిమాలు ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్‌’లు బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లను అందుకున్నాడు. ఆ మూడు సినిమాలు కూడా ఆయా హీరోల కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రాలుగా నిలిచాయి. దాంతో ఆ హీరోలు మళ్లీ దర్శకుడు కొరటాలతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటికే ‘శ్రీమంతుడు’ కాబో రిపీట్‌ అవుతుంది. ప్రస్తుతం మురుగదాస్‌ దర్శకత్వంలో నటిస్తున్న మహేష్‌బాబు ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యింది. వచ్చే నెలలో సినిమా సెట్స్‌ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఇక ఎన్టీఆర్‌ కూడా కొరటాల శివతో మరో సినిమా చేయాలని కోరుకుంటున్నాడు. అందుకు తాజాగా కొరటాల శివ ఓకే చెప్పాడు. మహేష్‌బాబుతో సినిమా పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్‌తో కొరటాల శివ సినిమా ప్రారంభం కాబోతుంది. వచ్చే సంవత్సరం వేసవి వరకు వీరి మూవీ ప్రారంభం అయ్యే ఛాన్స్‌ ఉంది. ఇక ప్రభాస్‌ కూడా మరోసారి ‘మిర్చి’ కాంబోను రిపీట్‌ చేయాలని కోరుకుంటున్నాడు. వీరితో పాటు రామ్‌ చరణ్‌ కూడా కొరటాలతో సినిమా చేయాలని ఆశిస్తున్నాడు. గతంలో కొరటాల దర్శకత్వంలో చరణ్‌ సినిమా ప్రారంభం అయ్యి, క్యాన్సిల్‌ అయ్యింది. ఇప్పుడు మళ్లీ ఆ సినిమా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి కొరటాల కోసం స్టార్‌ హీరోలు క్యూ కట్టి మరీ నిల్చుంటున్నారు.

Leave a Reply