గుంటూరుకి పదవుల వరద..ఎన్నికల మహిమా?

Posted October 1, 2016

state level corporation positions gunturరాజధాని రాకతో ఉబ్బితబ్బిబ్బవుతున్న గుంటూరు జిల్లా తమ్ముళ్ళని ఇప్పుడు మరో ఉత్సాహం ఊపేస్తోంది.కొత్తగా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లాకి పెద్ద పీట వేశారు.తాజా నియామకాల తరువాత చూస్తే జిల్లాకి చెందిన 8 మంది టీడీపీ నేతలకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి.మరో 17 మందికి డైరెక్టర్ పదవులు వచ్చాయి.

జిల్లాలో తొలి నామినేటెడ్ పదవి నరసరావుపేటకు చెందిన ఎల్లా శేషసాయిబాబు తో మొదలైంది.వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన సాయి పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడు జగన్ అవినీతికి సంబంధించిన గుట్టుమట్లు వెలికితీయడంలో కీలక పాత్ర పోషించారు.అందుకు మెచ్చిన సీఎం ఆయనకి 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా అవకాశమిచ్చారు.ఆ తరువాత నియామకాలు ఆగడంతో పార్టీ శ్రేణులు నిరుత్సాహపడ్డాయి.అంతలోనే నన్నపనేనికి మహిళా కమిషన్,వికలాంగుల సంస్థ కి గోనుగుంట్ల వెంకటేశ్వరరావు ,నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ కి గుంటుపల్లి నాగేశ్వరరావు,ఏపీ రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు కి డొక్కా మాణిక్య వరప్రసాద్,మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కి ఎండీ హిదాయత్ ,కల్లుగీత కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి తాతా జయప్రకాష్ నారాయణ,కృష్ణబలిజ పూసల కో ఆపరేటివ్ కి కావేటి సామ్రాజ్యం చైర్మన్లుగా నియమితులయ్యారు. కొద్దికొద్ది వ్యవధిలో ఈ నియామకాలు జరుగుతూ వచ్చాయి.అటు 17 డైరెక్టర్ పదవులు కూడా జిల్లా నేతలకి దక్కడంతో తమ్ముళ్ల ఆనందానికి అవధుల్లేవు.వారు ప్రెస్ మీట్ పెట్టి మరీ బాబు,లోకేష్ కి కృతజ్ఞతలు చెప్పారు.

అయితే ఇదంతా రాజకీయ లబ్ది కోసమేనని వైసీపీ ఆరోపిస్తోంది.గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఈ నియామకాలు చేశారంటోంది.

SHARE