కన్నడ సినిమా క్లైమాక్స్ షూటింగ్‌లో అనుకోని సంఘటనతో ఇద్దరు స్టంట్‌మెన్స్ ప్రాణాలొదిలారు.. బెంగళూరులో గుడిమస్తీ అనే కన్నడ చిత్రం కోసం ఫైటింగ్ సీన్ చిత్రీకరిస్తూన్నారు. చివరి ఫైట్ కోసం హెలీకాఫ్టర్ నుంచి నీళ్లలోకి దూకాలి.. అలా ముగ్గురు పైనుంచి దూకగ.. కన్నడ యాక్టర్ విజయ్ ఒక్కడే ఈదుకుంటూ ఒడ్డుకుచేరి ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన ఇద్దరు ఉదయ్, అనిల్ ప్రమాదవశాస్తు మునిగిపోయి మృత్యువాత పడ్డారు. దాదాపు 100 అడుగుల ఎత్తునుంచి నీళ్లులోకి దూకే సన్నివేశం అయినా చిత్ర బృందం ఎటువంటి ముందుస్తు చర్యలు తీసుకోలేదు. కనీసం ఒక్క మోటార్‌బోట్ కూడా అందుబాటులో ఉంచుకోలేదంటే వారెంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు.. ముందుజాగ్రత్త లేని కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారు.