Posted [relativedate]
మెగా స్టార్ చిరంజీవి,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను,అశ్వనీ దత్ కలిసి ఓ సినిమా చేస్తామని కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి ఘనంగా ప్రకటించారు. ఆ వార్త తెలుగు మీడియాని ఒకటి రెండు రోజులు కమ్మేసింది.ప్రభంజనంలా వచ్చిన ఆ వార్త కొద్ది రోజులకే తుస్సుమంది.ఒక్క సుబ్బిరామిరెడ్డి తప్ప పైన చెప్పుకున్న వారిలో ఒక్కరు కూడా టీఎస్సార్ చెప్పిన వార్తని ధృవీకరించలేదు.పైగా అమెరికా టూర్ కి వెళ్ళినప్పుడు అసలు అలాంటి ప్రతిపాదన ఏదీ తన దగరికి రాలేదని పవన్ ప్రకటించారు.ఇక చిరు,త్రివిక్రమ్,అశ్వనీదత్ లో ఒక్కరు కూడా దీనిపై నోరు మెదపలేదు.దీంతో ఆ కాంబినేషన్ అటకెక్కినట్టే అని అంతా భావించారు.
ఈ టైం లో విశాఖలో తాను జరపబోయే శివరాత్రి ఉత్సావాల గురించి చెప్పేందుకు టీఎస్సార్ మీడియా ముందుకు వచ్చారు.దీంతో మళ్లీ మెగా స్టార్,పవర్ స్టార్ సినిమా ప్రస్తావన వచ్చింది. ఈసారైనా ఆ పెద్దాయన మాట దాటేసినా లేక వున్న నిజం చెప్పేసినా బాగుండేది.కానీ ఇప్పటికీ సినిమా ఉంటుందని కళాబంధు ప్రకటించారు.ఎప్పుడు అన్నదానికి నేరుగా సమాధానం ఇవ్వకుండా ఓ లిస్ట్ చదివారు.సినిమా ఉంటుంది కానీ అంటూ ఆ పెద్దాయన చెప్పిన విషయాలు ఇవి..
1 . ప్రస్తుతం చిరు,పవన్ తలో రెండుమూడు సినిమాలు ఒప్పుకున్నారు.అవి అయ్యాక
2 . చిరు,పవన్ కాంబినేషన్ కి తగ్గ కధ దొరికి అది ఇద్దరికీ నచ్చాక…కొత్త సినిమా మొదలవుతుందట. ఇప్పుడు చెప్పండి..ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో? సుబ్బిరామిరెడ్డి ఇన్ని ప్రకటనలు చేయడానికి కారణం ఒకే ఒక్క మీటింగ్.త్రివిక్రమ్ తో ఆ ఇద్దరు అన్నదమ్ముల కి తగ్గ కధ ఉంటే చేద్దామని అడిగారు టీఎస్సార్.సరే చూద్దాం అని ఆయన అనగానే ప్రకటనలు ఇచ్చేసారు.
మిగతా వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోకుండా ఆయన ఇప్పటికీ పాత పాట పాడడం చూస్తుంటే మెగా బ్రదర్స్ సాక్షిగా పెద్దాయన ఆత్మవంచన చేసుకున్నట్టు కనిపిస్తోంది.