తమిళనాడులో రాష్ట్రపతి పాలనా?

Posted October 7, 2016

 subra manian swamy wrote letter rajnath singh tamilnadu govt president rule

జయలలిత అనారోగ్యంతో బాధపడుతున్న దృష్ట్యా తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ సీనియర్ ఎంపీ సుబ్రమణ్య స్వామి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌కు లేఖ రాశారు. సీఎం జయలలిత రెండు వారాలుగా ఆస్పత్రిలోనే ఉండటం వల్ల, ఆమె ఎప్పుడు పూర్తి స్థాయిలో కోలుకుంటారో తెలియని నేపథ్యంలో పాలనా వ్యవస్థ గాడి తప్పందని, శాంతిభద్రతలు కుంటుపడ్డాయని ఆ లేఖలో స్వామి పేర్కొన్నారు. తమిళనాడు పరిపాలనా బాధ్యతలను మాజీ ప్రధాన కార్యదర్శి చేతిలో పెట్టినట్లు తెలుస్తోందని ఆయన లేఖలో సందేహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల మధ్య తమిళనాడులో ఐఎస్ ఉగ్రవాదులు, ఎల్టీటీఈ ఉగ్రవాదులు, నక్సలైట్లు చురుగ్గా పావులు కదిపే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రపతి పాలన విధించాలని స్వామి కోరారు. ఇదిలా ఉంటే జయలలితను మెరుగైన వైద్యం కోసం సింగపూర్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 jayalalitha apolo hospital press notejayalalitha apolo hospital press note

SHARE