కరుణ క్రూరత్వం,జయ సున్నితత్వం చూసిందెవరు?

 Posted October 24, 2016

subrahmanya swamy comments on jayalalitha and karunanidhiవివాదాస్పద అంశాలలో తరచూ వేలు పెట్టే బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఈసారి తమిళ రాజకీయ దిగ్గజాల మీద మాట్లాడారు.తనకు ముఖ్యమంత్రి జయలలిత,మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో వ్యక్తిగత పరిచయం ఉందని చెప్పుకున్న స్వామి తన అనుభవాల నుంచి ఓ జాతీయ ఛానల్ చర్చలో వారిని విశ్లేషించే ప్రయత్నం చేశారు.

సందర్భాన్ని బట్టి జయకి తాను సన్నిహితంగాను,ప్రత్యర్థిగాను వ్యవహరించానని అయన వివరించారు.సన్నిహితంగా వున్నప్పుడు ఆమెతో జరిపిన సంభాషణల్లో జయ సున్నితత్వం బయటపడేదని స్వామి తెలిపారు.తాను ఎదుర్కొన్న అవమానాల గురించి చెప్పే సందర్భాల్లో జయ భావోద్వేగాలు కనిపించేవని స్వామి అభిప్రాయపడ్డారు.ఆమెతో విభేదించినపుడు కూడా జయ వ్యవహారశైలి తన్నెప్పుడూ ఇబ్బందిపెట్టలేదని అయన చెప్పుకొచ్చారు.

ఇక కరుణానిధి వ్యవహారంలో మాత్రం చేదు అనుభవాలు తప్పలేదని స్వామి అన్నారు.అయన ఓ క్రూరమైన రాజకీయ వేత్తగానే ప్రతి సందర్భంలోను వ్యవహరించినట్టు చెప్పారు.వ్యక్తిగత సంభాషణల్లోనూ అయన రాజకీయ ప్రయోజనాలు ఆశించే మాట్లాడేవారని స్వామి ఆవేదన చెందారు.

SHARE