సుబ్బు నెక్స్ట్ టార్గెట్ స్టాలిన్?

0
380
subrahmanya swamy next target stalin

 Posted [relativedate]

subrahmanya swamy next target stalin
సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి. ఇప్పుడు ఈ పేరు చాలా పాపుల‌ర్ అయిపోయింది. రాజ‌కీయ నాయ‌కుడిగా కంటే… పిటిష‌న్ల వేయ‌డం వ‌ల్లే ఆయ‌న‌కు ఎక్కువ పాపులారిటీ వ‌చ్చింది. అవినీతి, అక్ర‌మాల్లో ఆరితేరిన రాజ‌కీయ నాయ‌కులు ఎవ‌రైనా క‌నిపిస్తే చాలు .. వారి అవినీతిపై వెంట‌నే పిటిష‌న్లు వేస్తార‌ని ఆయ‌న గురించి చెబుతుంటారు. ఇప్పుడు శ‌శిక‌ళ‌కు శిక్ష ప‌డింది కూడా ఆయ‌న పిటిష‌న్ వ‌ల్లే. అప్పుడు జ‌య‌ల‌లిత‌ను జైలు పంపించ‌డం అయినా… ఇప్పుడు శ‌శిక‌ళ‌ చెరసాలకు వెళ్ల‌డానికైనా ఈ పిటిష‌న్ లే కార‌ణ‌మ‌య్యాయి. అలాంటి సుబ్బు త‌ర్వాతి టార్గెట్ ఎవ‌ర‌న్న దానిపై జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

డీఎంకే భ‌విష్యత్తును నిర్దేశించే నాయ‌కుడిగా ఎదుగుతున్న స్టాలినే … సుబ్బు త‌ర్వాతి టార్గెట్ అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే శ‌శిక‌ళ కంటే డీఎంకేకు చెందిన స్టాలిన్, ద‌యానిధి మారన్, క‌ళానిధి మార‌న్ చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన వ్య‌క్తులంటూ ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. అవినీతిని పార‌దోల‌డం అనే కార్య‌క్ర‌మంలో ఇంకా చేయాల్సింది చాలానే ఉందంటూ ట్విట్ట‌ర్లోనూ పేర్కొన్నారు. ఈ మాట‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే…. స్టాలిన్ అవినీతిపై సుబ్బు ద‌గ్గ‌ర ప‌క్కా స‌మాచారం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

త‌మిళ‌నాడులో శ‌శిక‌ళ‌ను ప‌క్క‌నబెడితే బీజేపీకి అడ్డంకిగా ఉన్నది ఒక్క స్టాలినే. కాబట్టి ఇత‌న్ని అడ్డు తొల‌గించాలంటే ఏదైనా అనుకోనిది జ‌ర‌గాలంటే బీజేపీ బ‌లంగా కోరుకుంటోంది. కాబ‌ట్టి సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి పిటిష‌న్ వేయ‌డం ఖాయ‌మ‌ని టాక్. అంతేకాదు ఈ పిటిష‌న్ కూడా చాలా బ‌లంగా ఉండ‌బోతుంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే బీజేపీ పెద్ద‌ల‌తోనూ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ఈ విష‌యంపై మాట్లాడార‌ట‌. దీంతో ఢిల్లీ పెద్ద‌లు కూడా మంచి ఆలోచ‌న చేస్తున్నార‌ని సుబ్బును మెచ్చుకున్నారట‌.

అస‌లే పొగ‌డ్త‌ల‌కు ప‌డిపోయే సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ఇప్పుడు… నెక్స్ట్ ఏం చేయ‌బోతున్నార‌న్న‌ది ఆస‌క్తి క‌రంగా మారింది. అయితే డీఎంకే శ్రేణులు మాత్రం… ఈసారి స్టాలిన్ వంతు వ‌స్తే…. త‌మ ప‌రిస్థితి ఏంట‌ని ఆందోళ‌న చెందుతున్నార‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Leave a Reply