సుదీప్ భారీ ప్లాన్ ..

 sudeep big plan movieకన్నడ హీరో సుదీప్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన మంచి నటుడే కాదు .. దర్శకుడు కూడా. సింగం, విక్రమార్కుడు, మిర్చి, అత్తారింటికి దారేదీ లాంటి రీమేక్ లను అక్కడ తెరకెక్కించి సూపర్ హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం కథానాయకుడిగా ఆయన వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తరువాత సుదీప్ ఒక భారీ సినిమాను తెరకెక్కించనున్నారు.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ‘బాహుబలి’ తరహాలో వుండే ఒక భారీ సినిమాకి తాను దర్శకత్వం వహించనున్నానని అన్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తికాగానే ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుందనీ వెల్లడించారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రం షూటింగ్ మొదలుకావొచ్చని సమాచారం.

SHARE