ఆ విలన్ కి పవన్ అంటే పిచ్చి

 Posted October 29, 2016

sudeep remake pawan kalyan moviesరాజమౌళి ‘ఈగ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు సుదీప్.అప్పటికే కన్నడలో ఆయన పెద్ద స్టార్ హీరో. ‘ఈగ’లో విలన్ గా అద్భుతమైన నటనని కనబర్చాడు. ఆ తర్వాత బాహుబలిలోనూ చిన్న పాత్ర వేసి ముచ్చట తీర్చుకున్నాడు.

సుదీప్ కి తెలుగు సినిమాలపై మంచి గురి.గత యేడాది పవన్ బ్లాక్ బస్టర్”అత్తారింటికి దారేది” సినిమాని ‘రన్నా’ గా రిమేక్ చేసి బంపర్ హిట్ కొట్టాడు. అచ్చం పవన్ మేనజరిజం ని ఫాలో అయ్యాడని రివ్యూలో కామెంట్స్ వినిపించాయి.ఈ యేడాది కూడా పవన్-వెంకీల మల్టీస్టారర్ చిత్రం ‘గోపాల గోపాల’చిత్రాన్ని ‘ముకుందా  మురారి’గా రిమేక్ చేస్తున్నాడు… కిచ్చా(సుదీప్ ముద్దు పేరు). ఇందులో పవన్ నటించిన మోడ్రన్ కృష్ణుడిగా సుదీప్.. వెంకీ పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నారు.ఈ మధ్యే విడుదల అయిన ఆ మూవీ ట్రైలర్ కు శాండల్ వుడ్ లో భారీ రెస్పాన్స్ వస్తోంది.

వరుసగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రెండు సినిమాలని రిమేక్ చేయడంతో సుదీప్ కి పవన్ అంటే అంత పిచ్చా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అన్నట్టు  పవన్ తాజా చిత్రం ‘కాటమరాయుడు’ విశేషాలని కూడా సుదీప్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడట. ఈ చిత్రాన్ని కూడా రిమేక్ చేస్తాడేమో !

SHARE