చక్కెర ఆమ్లం ..బెల్లం క్షారం

Posted [relativedate]

sugar acid jaggery alkalineచక్కర (పంచదార)
Sugar….. గురించి

చెరకు నుండి చక్కరను తయారు చేస్తారు. మన భారతీయులు చెరకుతో బెల్లాన్ని మాత్రమే తాయారు చేశారు. యూరప్ దేశాలలో చెరకు నుండి చక్కెర (పంచదార) ను తయారు చేశారు. పంచదార తయారు కాగానే అందులోని ఫాస్ఫరస్ పూర్తిగా అంతమైపోతుంది. కానీ మనకు కఫాన్ని సక్రమంగా ఉంచటానికి ఫాస్ఫరస్ ఎంతో ముఖ్యం. ఇది బెల్లం లోనే ఉంటుంది.

చక్కెర ఎంతటి కెమికల్ అంటే అది మన శరీరంలో జీర్ణమయ్యాక మిగిలేది యాసిడ్ , అదే బెల్లం జీర్ణమయ్యాక మిగిలేది క్షారం. మనం ప్రతి రోజు పాలు , టీ , ఇలా అన్నింటిలోనూ చక్కెర వాడకం వల్ల దాని నుండి తయారయ్యే యాసిడ్ కారణంగా మనలో వచ్చేవి వాతరోగాలు.

చక్కెరని జీర్ణం చెయ్యటానికి మన కడుపు ఎంతో కష్టపడవలసి ఉంటుంది. కానీ బెల్లం తింటే అది మీరు తీసుకున్న ఇతర ఆహారాన్ని కూడా బెల్లమే జీర్ణం చేస్తుంది. అంత గొప్పది బెల్లం. మన శరీరంలో తయారయ్యే ఆమ్లాలను బెల్లంలోని క్షార గుణం కంట్రోల్ చేస్తుంది , నియంత్రిస్తుంది. మనల్ని ఆరోగ్యవంతునిగా ఉంచుతుంది.

ఎల్లప్పుడూ సాధ్యమైనంత ఎక్కువగా బెల్లాన్ని ఉపయోగించి ఆరోగ్యాని పొందండి.

” ఆరోగ్యమే — మహాభాగ్యం “

Leave a Reply