కొండెక్కబోతున్నషుగర్ ..

0
533

 sugar very cost

ఇన్నాళ్లు ధరల పోటీలో రెస్టు తీసుకున్న పంచదార జూలు విధులుస్తోంది .
పండుగల సీజన్లో స్వీట్ల రేట్లు మరింత పెరగనున్నాయి. శ్రావణ మాసం.. పండుగల సీజన్ కావడంతో పిండి వంటల్లో చక్కర ను ఎక్కవగా వినియోగిస్తుంటారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో షుగర్ రేట్లు చూస్తే భయపడిపోతున్నారు జనం. గతేడాది ఇదే సమయంలో కిలో27 రూపాయలున్న చక్కర… ఇప్పుడు 45 రూపాయలకు చేరింది.

పండుగల సమయంలో.. దేవుడికి నైవేద్యం పెట్టాలన్నా.. స్వీట్స్, చేసుకోవాలన్నా.. చక్కర తప్పని సరి. రేట్లు పెరిగినప్పుడల్లా.. రేషన్ షాపుల్లో అరకిలో చక్కర మాత్రమే ఇస్తున్నారని.. చెక్కర కోటాను పెంచాలంటున్నారు జనం. పెరుగుతున్న షుగర్ రేట్లతో వ్యాపారులు కూడా భయపడిపోతున్నారు. షుగర్ రేట్లు పెరిగినా.. స్వీట్ల రేట్లు పెంచడం సాధ్యం కాదంటున్నారు. పోటీ వ్యాపారంలో స్వీట్ల రేట్లు పెంచితే బిజీనెస్ పడిపోతుందంటున్నారు. షుగర్ రేట్లు పెరగడానిక ప్రధాన కారణం నిజాం దక్కన్ షుగర్ కంపెనీలు మూతపడడమే.

2015-16 లో నిజాం దక్కన్ షుగర్స్ కంపెనీ పరిధిలోని మూడు ప్యాక్షర్టీలు మూతపడడంతో చక్కర ఉత్పత్తి, సాగు విస్తీర్ణంపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో వున్న షుగర్ నిల్వలు.. శ్రావణ మాసంతోపాటు మరో రెండుమూడు నెలల పాటు సరిపోనున్నాయి. తర్వాత ఖరీఫ్ పంట చేతికి రావాలంటే.. మరో ఐదారు నెలల సమయం పడుతుంది. దీంతో మరో మూడు నెలల తర్వాత షుగర్ రేట్లు ఆమాంతం పెరిగిన ఆశ్చర్య పడనక్కర్లేదంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.

Leave a Reply