చిరు ఫ్రెండ్ ని ఏడిపించిన ఎన్టీఆర్..

0
1002

Posted [relativedate]

Image result for suhasini crying

మెగా స్టార్ చిరంజీవి కి చిత్ర పరిశ్రమలో ఎందరితోనో మంచి స్నేహసంబంధాలున్నాయి. ఒకప్పుడు తనతో పని చేసిన రాధిక,రాధ,సుహాసిని వంటి వారితో మంచి ఫ్రెండ్ షిప్ వుంది.వీరిలో కొందరు హైదరాబాద్ వస్తే చిరు ఇంటికి తప్పకుండా వెళ్ళొస్తారు.మరికొందరు అయన ఇంట్లోనే దిగుతారు.అలాంటి స్నేహం ఉన్నవారిలో సుహాసిని మణిరత్నం ఒకరు.అలాంటి ఆమెని ఎన్టీఆర్ ఒకప్పుడు తెగ ఏడిపించాడట.ఈ విషయాన్ని క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ స్వయంగా చెప్పాడు.ఆ విషయం తెలుసుకోవాలంటే కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే..

అది రాఖీ సినిమా క్లైమాక్స్ షూటింగ్ టైం.కోర్టు సీన్ తీస్తున్నారు.పరుచూరి బ్రదర్స్,ఉత్తేజ్ రాసిన రెండు వెర్షన్స్ చదివిన వంశీ వాటిని కలిపి ఒకే వెర్షన్ తయారు చేశారు.భారీ డైలాగ్ లున్న ఆ సీన్ పేపర్స్ ఎన్టీఆర్ చేతికి ఇచ్చారు.ఓ పది నిమిషాలు పక్కకెళ్ళొచ్చిన ఎన్టీఆర్ షాట్ రెడీ అన్నాడు. వంశీ రాసిన ఆ డైలాగ్స్ సింగల్ టేక్ లో ఒకే చేసాడు ఎన్టీఆర్.ఆ డైలాగ్ డెలివరీ లో విరుపులు,మెరుపులు,నటన చూస్తున్న సుహాసిని భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారట.తన నటనతో చిరు ఫ్రెండ్ ని ఆ విధంగా ఏడిపించేసాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ .

[wpdevart_youtube]jQTxRezZs0M[/wpdevart_youtube]

Leave a Reply