సుజ‌నా సెల్ఫ్ గోల్!!

0
340
sujana self goal

Posted [relativedate] 

sujana self goal
రాజకీయాల్లో హ‌త్యలుండ‌వు… ఆత్మహ‌త్యలే ఉంటాయి అని చెబుతారు. అందుకే రాజ‌కీయాల్లో ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలి. లేక‌పోతే ఒక్క డైలాగ్ కూడా రాజ‌కీయ భ‌విత‌వ్యాన్ని త‌ల‌కిందులు చేయ‌డం ఖాయం. కేంద్రమంత్రి సుజ‌నా చౌద‌రి కూడా ఇలా ఘాటైన వ్యాఖ్యలు చేసి… తనతో పాటు పార్టీని డిఫెన్స్ లో ప‌డేశారన్న వాదన వినిపిస్తోంది.

ఓవైపు ప్రత్యేక‌హోదాపై ఏపీలో హాట్ హాట్ వాతావ‌ర‌ణం నెల‌కొన్న త‌రుణంలో … కేంద్రమంత్రి సుజ‌నా చౌద‌రి కొత్త త‌ల‌నొప్పుల‌కు తెర‌తీశారు. ప్రతిపక్షాల‌కు స్ట్రాంగ్ పంచ్ ఇవ్వాల‌న్న తొంద‌ర‌లో…. శృతి మంచి మాట్లాడారు. జల్లికట్టు స్ఫూర్తి కావాలనుకుంటే కోళ్ల పందాలు, పందుల పందాలు ఆడుకోవచ్చని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అంశ‌మంటూ బీజేపీకి చెందిన నాయ‌కుడిలా పుండుమీద కారం జల్లే ప్రయత్నం చేశారు.

సుజ‌నా చౌదరి వ్యాఖ్యల‌పై దుమారం రేగింది. ఆయ‌న వ్యాఖ్యలతో యూత్ లో మాత్రం టీడీపీపై ఒక్కసారిగా వ్యతిరేక‌త పెరిగిందట. హోదా అంశాన్ని పందుల పందేల‌తో పోల్చి చెప్పడం ఎంత‌వర‌కు క‌రెక్టో చెప్పాల‌న్న డిమాండ్ వినిపిస్తోంది. అస‌లు రెండింటి మ‌ధ్య ఎలాంటి పోలిక లేదు. ఒక నిషేధంలో మాత్రమే పొంత‌న ఉంది. యువత పోరాటస్ఫూర్తిని ఇంత దిగజార్చి మాట్లాడ్డం ఆయన హోదాకు తగదంటున్నారు జనం. హోదాపోరు తీవ్రంగా న‌డుస్తున్న త‌రుణంలో ఈ ఘాటు వ్యాఖ్యలు అవ‌స‌ర‌మా… అంటూ సొంత పార్టీ నేత‌లే ఫైర‌వుతున్నారు. చివరకు పవన్ కూడా సుజనా తీరును ఖండించారు.

సుజ‌నా వ్యాఖ్యలు చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లాయట. ఒక‌వైపు తాను సంయ‌మ‌నంతో ఉంటే… ఇలా కేంద్రమంత్రిగా ఉన్న వ్యక్తి …. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట‌. సుజ‌నా కాబ‌ట్టి బాబు ఊరుకున్నారు …. కానీ ఆయన స్థానంలో వేరే వాళ్లుంటే… వేటు కూడా ప‌డేదట. మొత్తానికి సుజ‌నా చౌద‌రి సెల్ఫ్ గోల్ చేసుకున్నార‌ని పార్టీ నేత‌లు గుస్సా అవుతున్నారు. ఈవిష‌యంలో బాబు నుంచి కూడా కేంద్రమంత్రివ‌ర్యుల వారికి అక్షింత‌లు ప‌డ్డాయ‌ని టాక్. ఇప్పటికైనా హోదాపై హోదా మ‌రిచి మాట్లాడొద్దని బాబు హెచ్చరించార‌ట‌. ఈ అసంబ‌ద్ధ ప్రేలాప‌న‌లు క‌ట్టిపెట్టాల‌ని సీరియ‌స్ గా వార్నింగ్ కూడా ఇచ్చార‌ట‌. మ‌రి ప్రాస కోసం పందుల ఈ మాత్రం రియాక్షన్ రావడం కామనే కదా!!

Leave a Reply