చరణ్ మూవీపై సుకుమార్ జోకేశాడు

sukumar comedy charan movie

మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం ధ్రువ సినిమా చేస్తున్నాడు. తమిళ నాట విజయ ఢంఖా మోగించిన తని ఒరువన్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సురేందర్ రెడ్డి డైరక్షన్లో వస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత సుకుమార్ మూవీ కమిట్ అయిన చెర్రి ఆ సినిమాను అక్టోబర్ లో స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సుక్కు అండ్ టీం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మీద కసరత్తు చేస్తున్నారు.

అయితే సుకుమార్ చరణ్ సినిమాను ఫిబ్రవరి కల్లా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని అంటున్నాడట. ఇదో రకంగా కామెడీ అనే చెప్పాలి. సుకుమార్ సినిమా అంటే భారీ బడ్జెట్ భారీ షెడ్యూళ్లు కామనే అవసరం ఉన్నా లేకుండా ఫారిన్ షూట్స్ కూడా చేయాల్సిందే. మరి అలాంటిది నాలుగు నెలల్లో సుకుమార్ చరణ్ తో సినిమా తీసి రిలీజ్ చేస్తాననడం పెద్ద జోకే అని చెప్పాలి. ఫార్ములా ఎక్స్ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. మరి అలాంటి ఫార్ములాను కేవలం నాలుగు నెలల్లో ఫినిష్ చేస్తా అనడం కాఎడీగానే ఉన్నా ఏమో సుక్కు అనుకున్నాడంటే చేసి చూపిస్తాడేమో అని అభిప్రాయపడుతున్నారు సిని జనాలు.

SHARE