వంశీ రూటులో సుకుమార్..

Posted October 6, 2016

  sukumar next movie ram charan presenting like krishna vamshi

‘ధృవ’తో బిజీగా ఉన్నాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కతోన్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రం తర్వాత చెర్రీ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోపు స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు సుక్కు.

హీరోని డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే సుక్కు.. చెర్రీని ఏవిధంగా చూపించబోతున్నాడనే ఆసక్తి మెగా అభిమానుల్లో అప్పుడే మొదలైంది. తాజాగా, చెర్రీ సినిమా సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ని చెప్పాడు సుకుమార్. రాంచరణ్ కోసం గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథని రెడీ చేశానని.. ఇందులో చెర్రీ లుక్ చాలా కొత్తగా ఉంటుందని హింట్ ఇచ్చాడు.

గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన రాంచరణ్ ‘గోవిందుడు అందరివాడె’ గ్రామీణ నేపథ్యంలోనే తెరకెక్కింది. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర
పెద్ద ప్రభావాన్ని చూపలేకపోయింది. ఇప్పుడు సుకుమార్ కూడా చెర్రీతో గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో వస్తానంటున్నాడు. మరి.. చెర్రీని సుకుమార్
ఏం చేస్తాడో చూడాలి.

SHARE