టాలీవుడ్లో జంధ్యాల తర్వాత గొప్ప రైటర్ కం డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రతిభాశాలి త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇలాంటి టాలెంటెడ్ వ్యక్తితో పరశురామ్‌ను పోల్చారు డైరెక్టర్ సుకుమార్. త్రివిక్రమ్ తర్వాత తెలుగులో అంత గొప్ప రచయిత పరశురామే అని కితాబిచ్చారు సుక్కు. ‘శ్రీరస్తు శుభమస్తు’ సక్సెస్ మీట్లో భాగంగా సుక్కు డైరక్టర్ పరశురామ్‌పై ప్రశంసలు వర్షం కురిపించారు.
సుక్కు లాంటి గ్రేట్ డైరెక్టర్ నుంచి ఈ కాంప్లిమెంట్ అందుకోవడం అంటే పరశురామ్ గర్వించాల్సిన విషయమే. ‘శ్రీరస్తు శుభమస్తు’లో మనసుకు హత్తుకునే మాటలు రాశాడు పరశురామ్. ఎమోషనల్ సన్నివేశాల్లో డైలాగులు అద్భుతంగా కుదిరాయి. ఈ నేపథ్యంలో అందరూ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘సారొచ్చారు’ ఫ్లాప్ అవ్వడంతో నిరాశకు గురైన పరశురామ్ కు ‘శ్రీరస్తు శుభమస్తు’ మంచి ఉత్సాహాన్నిచ్చింది.