Posted [relativedate]
ప్రేమకధ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్.. సత్యం సినిమా తర్వాత ఒక్క హిట్ ని కూడా కొట్టలేకపోయాడు. గజినీ మహ్మద్ ఇండియా మీద దండయాత్రలు చేసిన విధంగా సుమంత్ సినిమాలతో టాలీవుడ్ మీద దండెత్తుతూనే ఉన్నాడు. అయినా విజయాలను మాత్రం సాధించలేకపోతున్నాడు. ఆఖరికి హిందీలో విజయం సాధించిన విక్కీడోనర్ సినిమాను నరుడా డోనరుడూ పేరుతో రీమేక్ కూడా చేశాడు. అయినా అతన్ని అదృష్టం వరించలేదు. కాగా సినిమా సినిమాకి బాగా గ్యాప్ మెయిన్టేన్ చేసే సుమంత్ ఈ సారి కాస్త రూట్ ని మార్చినట్టు ఉన్నాడు. సినిమాకు వచ్చే టాక్ తో సంబంధం లేకుండా మూవీలను చేయాలని డిసైడ్ అయినట్లు ఉన్నాడు. అందుకే నరుడా డోనరుడా పోయినా వెంటనే కొత్త సినిమా మొదలెట్టేశాడు.
గౌతం తిన్ననూరి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సుమంత్ సరసన ఆకాంక్ష సింఘ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెలాఖరు నుండి రెగ్యూలర్ షూటింగ్ జరగనుంది. ఈ సినిమా ఓ లవ్ స్టోరీగా తెరకెక్కనుందని చిత్రయూనిట్ చెబుతోంది. యాక్షన్ తో పాటు మాస్ మాసాలాలన్నీ ఇందులో ఉండబోతున్నాయట. ఎందరో యంగ్ హీరోలు ప్రేమకధలతో పిచ్చెక్కిస్తుంటే ఇప్పుడు సుమంత్ ప్రేమకధ ఎక్కుతుందా.. ఏమో సుమంత్ ఆలోచన ఏవిధంగా ఉందో…