ఆదివారం పెట్రోల్ కు సెలవు

0
316
sunday holiday to petrol

Posted [relativedate]

sunday holiday to petrolఅప్పుడెప్పుడో ఆదివారం ఆడవాళ్లకు సెలవు అని సినిమా వస్తే.. మహిళలు పని చేయకపోతే ఎలాగని మగమహారాజులంతా తెగ ఫీలైపోయారు. ఇప్పుడు ఏకంగా ఆదివారం పెట్రోల్ పోయమంటున్నారు డీలర్లు. అదే జరిగితే ఆదివారం విందులు, వినోదాలు, విహారాలకు బ్రేక్ పడక తప్పదు. అసలు పెట్రోల్ డీలర్లు సడెన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే.. జస్ట్ కమీషన్ల కోసం. పైగా కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసే స్టేజ్ దాటిపోయిన డీలర్లు.. ఏకంగా బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి ఎదిగిపోయారు. అయితే సదరు డీలర్లకు కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే పట్టుందని, ఇండియా అంతా సీన్ లేదని ఆలిండియా పెట్రోల్ డీలర్ల అసోసియేషన్ చెప్పడంతో జనం కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

అసలు విషయమేమిటంటే ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ తరచుగా చెబుతున్నా మాట. అంతే మోడీ మాట ప్రకారం ఆదివారం పెట్రోల్ పోయమని డీలర్లు చెప్పేశారు. మోకాలికి, బోడిగుండుకి ముడిపెట్టిన చందంగా ఉన్న వీళ్ల ప్రకటన జనాన్ని కంగారుపెట్టేసింది. తమ వ్యాపారాల మనుగడ కోసం కమీషన్లు పెంచాలని ఎప్పట్నుంచో డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. అధికారులతో చర్చలు కూడా జరిగాయి. అయితే అవేవీ డీలర్లకు సంతృప్తి ఇవ్వలేదు. అధికారులు ప్రతిపాదించిన అరకొర పెంపు అస్సలు కుదరదంటున్నారు.

కేంద్రం దిగిరాకపోతే రేపు ఆదివారం నుంచే.. కార్యాచరణ ప్రారంభిస్తామంటున్నారు డీలర్లు. ఆదివారం బంకుల మూసివేత, ప్రతిరోజూ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకే బంకులు తెరుస్తామని బెదిరిస్తున్నారు. అదే జరిగితే వాహనదారులు ఇబ్బందిపడటం ఖాయంగా కనిపిస్తోంది. సొంత బంకులు ఏర్పాటుచేసుకున్న ఆర్టీసీకి ఇబ్బంది లేకపోయినా.. మిగతావారికి చుక్కలే. కానీ బెదిరింపు డీలర్ల అసోసియేషన్ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళలోనే బలంగా ఉన్నాయి. మిగతా దేశంలో బంకులు తెరిచిన.. తమ సంగతేంటని ఈ నాలుగు రాష్ట్రాల జనాలు ఇప్పట్నుంచే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు.

Leave a Reply