“నగరం” వచ్చేసింది.. చూశారా..?

0
379

Posted [relativedate] 

sundeep kishan nagaram movie trailerగుండెల్లో గోదారి, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి చిత్రాలతో యూత్ కి దగ్గరయ్యాడు సందీప్ కిషన్. దీంతో అతనికి వరుస అవకాశాలు వస్తున్నాయి. అందిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. ఇప్పుడు ఈ హీరో కృష్ణవంశీ దర్శకత్వంలో నక్షత్రంలోనూ, అలాగే లోకేష్‌ దర్శకత్వంలో నగరం సినిమాలోనూ నటిస్తున్నాడు.

ఈ నగరం సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. వెరైటీ చిత్రంగా ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచానాలున్నాయి. ఈ అంచనాలను మరింత పెంచే విధంగా చిత్ర యూనిట్ కొత్త ట్రైలర్ ని విడుదలచేసింది. ఒక నగరంలో 48 గంటల్లో నలుగురు వ్యక్తుల మధ్య జరిగే కధే నగరం సినిమా. సందీప్‌ కిషన్‌ ది ఒక స్టోరీ కాగా, రెజీనాది మరో స్టోరీ. శ్రీ అనే వ్యక్తిది ఇంకో స్టోరీ. ఈ మూడు స్టోరీలను కలుపుతూ ఒక డ్రైవర్‌ కథ వుంటుంది. ఈ నాలుగు కథలూ ప్యారలల్‌గా రన్‌ అవుతూ వుంటాయి. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలకు భిన్నంగా ఓ  డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ కమర్షియల్‌ మూవీ సందీప్ కిషన్ కి ఎలాంటి హిట్ ని అందిస్తుందో చూడాలి.

Leave a Reply