నాని హీరోయిన్ ను పట్టేసిన సందీప్ కిషన్

0
424

Posted [relativedate]

ns1516నాని సినిమాలో హీరోయిన్స్ కు ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. తను చేసే ప్రతి సినిమా కథాబలంతో ఉంటుంది కాబట్టి హీరోయిన్స్ పాత్రలకు అంత వెయిట్ ఉంటుంది. అయితే అదే వారికి హిట్ తో పాటుగా అవకాశాలను కూడా తెచ్చిపెడుతుంది. నాని కృష్ణగాడి వీర ప్రేమ గాథలో నటించిన మెహెరిన్ పిర్జాదా కౌర్ అందరి మన్నలను పొందింది. ఇప్పుడు ఆమెకు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమాలో లక్కీ ఛాన్స్ దక్కింది.

తెలుగుతో పాటు తమిళంలో సత్తా చాటాలని చూస్తున్న సందీప్ కిషన్ ఇప్పటికే అక్కడ మాయవన్, మానగరం సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక అవి కాకుండా నా పేరు శివ సుశీంద్రన్ డైరక్షన్లో ఓ సినిమా కమిట్ అయ్యాడు. అందులో హీరోయిన్ గా మెహెరిన్ దాదాపు కన్ఫాం అయినట్టే అట. తెలుగు తమిళ భాషల్లో రాబోతున్న ఈ సినిమాలో సందీప్, మెహెరిన్ పెయిర్ ఎంతగానో ఆకట్టుకుంటుందని అంటున్నారు. ప్రస్తుతం తెలుగులో కృష్ణవంశీ డైరక్షన్లో నక్షత్రం సినిమా చేస్తున్న సందీప్ ఆ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

Leave a Reply