సునీల్ విలన్.. ఇది నిజం ఎహే !

0
540

Posted [relativedate]

  sunil act villan role

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా కొనసాగుతుండగానే హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు సునీల్. హీరోగా కామెడీ చేసినా.. కమెడియన్ గా చూస్తున్నారని సిక్స్
చూపించాడు.  ఫిజిక్, లుక్.. ఇలా అని హీరోని తలపించేలా మారాడు. ‘మర్యాద రామన్న’ తర్వాత ఆ రేంజ్ లో హిట్ దక్కకపోయినా.. వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు సునీల్.

అంతేకాదు.. త్వరలోనే తనలోని విలనీజాన్ని చూపిస్తానంటున్నాడు. ‘ఈడు గోల్డ్ ఎహే’ ప్రమోషన్ లో పాల్గొన్న సునీల్.. విలన్ గా నటించబోతున్నట్టు  తెలిపాడు. అయితే, అది తెలుగు సినిమాలో కాదట. ఇతర బాషలో సునీల్ విలనీజం చూపించనున్నాడు. వచ్చే యేడాది సునీల్ ని విలన్ గా చూడొచ్చట. ఆ చిత్రం ఏదన్నది మాత్రం సునీల్ తెలపలేదు.

సునీల్ తాజా చిత్రం ‘ఈడు గోల్ద్ ఎహే’ వీరుపోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ దసరా కానుకగా ఈ శుక్రవారం (అక్టోబర్ 7)ప్రేక్షకుల ముందు  రానుంది. ఈ సారి కామెడీతో పాటుగా, థ్రిల్లింగ్ కి కూడా గురిచేయడం ఖాయమంటున్నాడు సునీల్.

Leave a Reply