జక్కన్న ప్రివ్యూ ….

0
389
sunil jakkanna movie preview

sunil jakkanna movie preview

చిత్రం : జక్కన్న (2016)
నటీనటులు : సునీల్, మన్నారా చోప్రా, సప్తగిరి, కబీర్ దుల్హన్ సింగ్
సంగీతం : దినేష్
దర్శకుడు : వంశీ కృష్ణ ఆకెళ్ల
నిర్మాత : సుదర్శన్ రెడ్డి, ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి
విడుదల తేదీ : 29 జులై, 2016.

స్టార్ కమెడియన్ నుంచి హీరోగా ప్రమోటైన సునీల్.. హీరోగా తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకోవాలని తెగ ట్రై చేస్తున్నాడు. ఎస్.ఎస్ రాజమౌళి ‘మర్యాద రామన్న’ ఒక్కటే సునీల్ కి బ్లాక్ బస్టర్ హిట్టిచ్చింది. అందాల రాముడు, పూలరంగడు ఫర్వాలేదనిపించాయి. ఇక, ఆ తర్వాత వచ్చిన సునీల్ సినిమాలు మిస్టర్ పెళ్లికొడుకు, భీమవరం బుల్లోడు, క్రిష్ణాష్టమి బాక్సాఫీస్ దగ్గర ఫట్టుమన్నాయి. ఇప్పుడు సునీల్ కి అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. అందుకోసం ఈసారి ‘జక్కన్న’గా మారాడు సునీల్. వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సునీల్ సరసన మన్నారా చోప్రా జతకట్టనుంది.

ఇదో కామెడీ ఎంటర్ టైనర్. సునీల్ మార్క్ కామెడీతో దర్శకుడు ‘జక్కన్న’ని చెక్కాడని చెబుతున్నారు. ‘ప్రేమ‌క‌థాచిత్ర‌మ్’ త‌రువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన చిత్రమిది. సుదర్శన్ రెడ్డి, ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి నిర్మాతలు. ప్రేక్షకుల్లో నవ్వులు పూయించేందుకు సునీల్ ‘జక్కన్న’గా (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి.. ఓ విజయం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ‘జక్కన్న’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించగలుగుతాడా..? సునీల్ ‘జక్కన్న’ విశేషాలపై ఓ లుక్కేద్దాం పదండీ..

ప్రివ్యూ :
*  గణేష్ (సునీల్) విలువలు కలిగిన వ్యక్తి. పర్ఫెక్షన్ కోరుకునే గణేష్.. ఎవరైనా సాయం చేస్తే. వారికి జీవితాంతం సాయం చేసే వ్యక్తిగా సునీల్
కనిపించనున్నాడు.
* ‘జక్కన్న’.. టైటిల్ తో సినిమాలో రాజమౌళిని భాగం చేశారు
* ఎందుకంటే రాజమౌళిని అందరూ జక్కన్న అని పిలుస్తుంటారు.
* జక్కన్న శిల్పాలను ఎంత అద్భుతంగా చెక్కుతాడో రాజమౌళి తన సినిమాలని అంత అందంగా చెక్కుతాడన్న మాట.
*  టాలీవుడ్ ఇదివరకే పరిచయమున్న పేరు జక్కన్న సినిమా రావడం కలిసొచ్చే అంశం
* జక్కన్న హీరో సునీల్ అవ్వడం మరో ప్లస్ పాయింట్
* సునీల్ కామెడీ బాగా పండించగలడు.. ఇది అందరికీ తెలిసిన విషయమే.
* జక్కన్నలో కూడా కావాల్సినంత కామెడీ ఉండనుందని చిత్రబృందం చెబుతోంది.
* ఫస్ట్ ఆఫ్ లో కథని, పాత్రల తీరుని పరిచయం చేసిన దర్శకుడు
* సెకాండాఫ్ లో కడుపుబ్బ నవ్వించే సీన్స్ రాసుకొన్నాడట.
* సో.. సెకాండాఫ్ సినిమాకి ప్రధాన బలంగా చెబుతున్నారు.
* దర్శకుడు వంశీ అరికెళ్ల.. సినిమాని అద్భుతంగా తీశాడని చెప్పుకొంటున్నారు
* కథకి సునీల్ మార్క్ కోటింగ్ కొట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడట.
* ఇదే నిజమైతే సినిమా ఫలితం పాజిటివ్ రావొచ్చు.
* హీరోయిన్ మన్నారా చోప్రా చూడ్డానికి బాగుంది. ఏ మాత్రం ఎక్స్ ప్రెషన్స్ పండించగలిగినా సరిపోద్ది.
* ఇక, సునీల్ కి తోడు కమెడియన్ సప్తగిరి కూడా ఉండటం కలిసొచ్చే అంశం.
* ఇప్పటికే జక్కన్నకి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది
* జక్కన్న ఆడియో వేడుకకి మెగాస్టార్ చిరంజీవి రావడంతో మరింత హైప్ ని క్రియేట్ చేసింది.
* మెగా అభిమానులు కూడా జక్కన్న ని ఆదరిస్తే.. సునీల్ కి ఓ విజయం దక్కినట్టే.
* ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్స్ తో సునీల్ టెంమ్ట్ చేస్తున్నాడు.

మొత్తానికి.. సరదగా.. కాసేపు టెన్షన్స్ కి దూరంగా హాయిగా నవ్వుకోవాలంటే సునీల్ జక్కన్నకి వెళ్లొచ్చని చెబుతోంది చిత్రబృందం. ఈ చిత్రం లైవ్ అప్ డేట్స్, పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేస్తూనే ఉండండి మీ.. తెలుగు బుల్లెట్ డాట్ కామ్.

Leave a Reply