
నిర్మాత మాట్లాడుతూ ” మా దర్శకులు క్రాంతి మాధవ్ తెరకెక్కించిన రెండు చిత్రాలు హ్రుదయాలకి హత్తుకునేలా వుంటాయి. ఆయన మార్క్ వుంటూ, సునిల్ తరహ కామెడి చేస్తూ ఓ చక్కని కమర్షయిల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను అందిచబోతున్నారు. సునీల్ పెర్ ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గా తన కామెడి తో జక్కన్న చిత్రాన్ని కమర్షియల్ గా విజయాన్ని తన ఖాతాలో జమచేసుకున్నాడు. ఈ చిత్రంలో తన క్యారెక్టరైజేషన్ ను విభిన్నంగా మలిచారు. ఇందులోని ప్రతీ పాత్రకు ప్రాధన్యముండేలా తీర్చి దిద్దారు. అద్భుతమైన సినిమాటోగ్రాఫర్ సర్వేశ్ మురారి కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. మెదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ని అగష్టు 29 నుండి ప్రారంభిస్తున్నారు. అన్ని వర్గాల్ని మెప్పించే ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మూవీ కాబోతుంది. మా బ్యానర్ నుంచి సూపర్ హిట్ చిత్రం చేయబోతున్నామని ధీమాగా చెప్పగలుగుతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. ”అని అన్నారు.