సునీల్ ను మార్చడం కష్టమే..!

Posted December 15, 2016

Sunil Shock To Trivikram Srinivas For Pawan Kalyan Movieకమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ క్రేజ్ తో హీరోగా మారిన సునీల్ ఈమద్య రేసులో చాలా వెనుకపడ్డాడు. హీరోగా చేస్తూనే కమెడియన్ గా కంటిన్యూ అవ్వొచ్చు కదా అని ఎవరు చెప్పినా పెడచెవిన పెడుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఖైది నెంబర్ 150లో ఛాన్స్ వచ్చినా కాదు అని చెప్పిన సునీల్ ఇప్పుడు త్రివిక్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా ఛాన్స్ వచ్చినా చేయనంటున్నాడట.

త్రివిక్రం సునీల్ మంచి స్నేహితులు అయితే ఈ క్రమంలో కాస్త వెనుకపడి ఉన్న సునీల్ కోసం త్రివిక్రం పవన్ కళ్యాణ్ సినిమాలో మంచి రోల్ రాసుకున్నాడట. ఇక ఎలాగు ఫ్లాపుల్లో ఉన్నాడు కాబట్టి సునీల్ ఒప్పుకుంటాడని అనుకున్నారు. కాని ఇక్కడ మ్యాటర్ అడ్డం తిరిగింది. త్రివిక్రం అవకాశం ఇచ్చినా సరే దాన్ని సున్నితంగా కాదనేస్తున్నాడట సునీల్. మరి ఇలానే ఉంటే సునీల్ ను మార్చడం కష్టం అంటున్నారు సిని విమర్శకులు.

ఈ ఇయర్ లో వచ్చిన మూడు సినిమలు ఫ్లాప్ అవడంతో సునీల్ చేసే తర్వాత సినిమా మీద పూర్తి దృష్టి ఉంచాడు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరక్షన్లో ఉంగరాల రాంబాబు సినిమా చేస్తున్న సునీల్ మలయాళ రీమేక్ మూవీలో కూడా నటిస్తున్నాడు. మరి రాబోయే ఈ రెండు సినిమాలైనా సునీల్ కష్టాలు తీరుస్తాయేమో చూడాలి.

SHARE