5 నిమిషాల పనికి 4 కోట్లు డిమాండ్ చేస్తున్న సన్ని..!

Posted [relativedate]

Sunny Demand 4 Crores For 5 Minits Dance Show.ఏ ముహుర్తాన సన్ని లియోన్ బాలీవుడ్ లో అడుగుపెట్టిందో కాని అప్పటి నుండి ఆమె క్రేజ్ కు స్టార్ హీరోల సైతం వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. తన హాట్ షోతో బీ టౌన్ ను హీటెక్కిస్తున్న సన్ని లియోన్ తాకిడి తట్టుకోలేక అక్కడ స్టార్స్ కూడా వారి సినిమాలో ఆమెతో ఓ ఐటం సాంగ్ పెట్టుకుంటున్నారు. అయితే డిసెంబర్ నెల వచ్చింది అంటే ఇక హాట్ భామలకు డిమాండ్ పెరిగినట్టే. ఆ ఒక్క రాత్రే కోట్లకు కోట్లు కాజేస్తుంటారు.

ఆ క్రమంలోనే సన్ని లియోన్ ఇప్పటికే రెండు మూడు చోట్ల కమిట్మెంట్ ఇవ్వగా కేవలం ఒక్క చోట్ల 5 నిమిషాల పాటకు డ్యాన్స్ చేసినందుకే 4 కోట్ల ఆఫర్ ఇచ్చారట ఓ హోటెల్ వారు. ప్రస్తుతం నటిస్తున్న రాయీస్ సినిమాలోని ఐటం సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి వెళ్తే చాలు 4 కోట్ల దాకా ఇస్తామని అంటున్నారట. మరి ఆ ఐదు నిమిషాల్లో సన్ని క్రేజ్ ఏమంత క్యాష్ చేసుకుంటారో కాని ఆమెకు మాత్రం 4 కోట్ల భారీ మొత్తం ఇచ్చేస్తున్నారట.

ఆఫర్ బాగుండటంతో ఓకే చెప్పిన సన్ని డిసెంబర్ 31 రోజున డే షెడ్యూల్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటుందట. ఓ పక్క సినిమాల్లో చేస్తూనే చేటినిండా సంపాదించుకుంటున్న సన్ని ఈరకంగా కూడా కోట్లు కూడబెట్టుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here