బాలయ్య సినిమాలో సన్నీ..

0
605
sunny leone in balakrishna puri jagannadh movie

 Posted [relativedate]

sunny leone in balakrishna puri jagannadh movieమెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ ఇద్దరూ ఈ సంక్రాంతికి ఒకేసారి తమ సినిమాలను విడుదల చేశారు. అయితే బాలయ్య తన 101వ సినిమాను మొదలు పెట్టేసినా చిరు మాత్రం 151వ సినిమాను ఇప్పటివరకు మొదలుపెట్టలేకపోయాడు. దీంతో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఈ సినిమాని బాల‌య్య ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టే అదిరిపోయే యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌ గా తీర్చిదిద్దుతున్న  పూరీ అభిమానులకు మరో తీపి కబురును అందించాడు. బాలయ్య సినిమాలో సన్నీ ఓ ఐటెం సాంగ్ చేస్తోందని చిత్రయూనిట్ చెబుతోంది.   నిజానికి పూరీ రూపొందించిన  రోగ్ ఆడియో వేదికపై తళుక్కుమంది  సన్నీ.  ఆ సాంగ్ కోసం సన్నీ ఏకంగా 25లక్షలు తీసుకుందని టాక్ నడిచినా ఇప్పుడు మాత్రం బాలయ్య సినిమాలో నటింపజేయడానికే పూరీ ఆ మాత్రం ఖర్చుపెట్టాడన్న టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా బాలయ్య సినిమాలో సన్నీ తన అందచందాలతో మరోసారి  అభిమానులకు కనువిందు చేయనుందన్నమాట.

Leave a Reply