రాజశేఖర్ మూవీలో సన్నీలియోన్..

0
747
sunny leone in rajasekhar movie

Posted [relativedate]

sunny leone in rajasekhar movieచాలా కాలం గ్యాప్ తర్వాత  హీరో రాజశేఖర్ నటిస్తున్న సినిమా psv గరుడ వేగ. అంకుశం, మ‌గాడు, ఆగ్ర‌హం వంటి చిత్రాల్లో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ల్లో న‌టించి మెప్పించిన  ఈ యాంగ్రీ యంగ్ మేన్‌ ఈ తాజా సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ గానే నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన పోస్టర్ సినిమాపై అంచనాలను ఏర్పరచగలిగింది. ఈ అంచనాలను మరింత పెంచే విధంగా ప్లాన్ చేస్తున్నాడట రాజశేఖర్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం…  సన్నీలియోన్ ని లైన్ లో పెట్టినట్లు సమాచారం.

సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటే బెటర్ అని భావించిందట చిత్రయూనిట్. ఈ స్పెషల్ సాంగ్ కోసం సన్నీని సంప్రదించారట.  ఆమెకు  పారితోషకం కూడా భారీగానే ముట్టచెప్పడంతో ఆమె  వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రాజశేఖర్ మరి ఈ సినిమాతోనైనా హిట్ కొడతాడేమో చూడాలి.

Leave a Reply