ఆ హీరోయిన్ కోసం సన్నీ లియోన్ ని పక్కన పెట్టేసారు..

0
673
sunny leone out shriya in nakshtram movie item song

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

sunny leone out shriya in nakshtram movie item songసందీప్ కిషన్ రెజీన జంటగా సాయి ధరమ్ తేజ్ ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం నక్షత్రం.. ఈ సినిమాను కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఈ నక్షత్రం మూవీ మొదలై చాలా నెలలు అయింది. దాదాపు షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ ఈ సినిమా విడుదలకు మాత్రం నోచుకోవటం లేదు. ఈ సినిమాపై చాలానే రూమర్స్ వచ్చాయి. కానీ.. త్వరలోనే నక్షత్రంను తెరపైకి తెస్తున్నట్లు కృష్ణ వంశీ చెప్పాడు.

మూవీపై హైప్ మరింతగా పెంచేందుకు ఇందులో ఓ ఐటెం సాంగ్ ను జత చేస్తున్నాడు దర్శకుడు. నిర్మాతలు కూడా ఇందుకు సై అనడంతో ఇప్పటికే ఆ అందాల భామ కోసం వేట కొనసాగుతోంది. ఇప్పటికే మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ను సంప్రదించారు, కానీ సన్నీ నుంచి ఈ విషయంపై ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. పైగా ఫాస్ట్ బీట్స్ కి తగినంత న్యాయం చేయలేదని గ్రహించిన డైరెక్టర్ ఆ ప్లేస్ లో నక్షత్రం మూవీ లో ఐటెం సాంగ్ చేసేందుకు శ్రియా శరణ్ ను ఫైనలైజ్ చేశారనే టాక్ వినిపిస్తోంది. శ్రియను సంప్రదించడం.. ఈ సాంగ్ లో డ్యాన్స్ కు చాలా ఇంపార్టెన్స్ ఉండటం వలన, శ్రియ అయితేనే ఈ ఫాస్ట్ బీట్ ఐటెం సాంగ్ కు న్యాయం చేయగలుగుతుందని ఆమెను ఓకే చేసినట్లు తెలుస్తోంది. . గౌతమిపుత్ర శాతకర్ణి సక్సెస్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసిన శ్రియ ఈ సాంగ్ లో నటిస్తే ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి..

Leave a Reply