స‌న్నీలియోన్ త‌ర్వాతే మోడీ!!

0
351
sunnyleone trumps narendramodi

Posted [relativedate]

 sunnyleone trumps narendramodi
ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఏంటి… స‌న్నీ లియోన్ త‌ర్వాత ఏంట‌ని ఆశ్చ‌ర్యపోకండి. పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ దాకా ఎదిగిన స‌న్నీ లియోన్ పాపులారిటీ ఆ రేంజ్ లో ఉంది మ‌రీ. ప్ర‌ధానమంత్రి కంటే స‌న్నీనే కావాలంటున్నారు జ‌నం. ఇదేంటి అని ఆశ్చ‌ర్య‌పోకండి. ఇది నిజ‌మే. నెటిజ‌న్లంతా లియోన్ కే జై కొడుతున్నారు.

నెట్ సెర్చింగ్ లో టాప్ ప్లేస్ లో స‌న్నీ లియోన్ అగ్ర‌స్థానంలో ఉంది. ఆమె దెబ్బ‌కు ప్రధాని మోడీ, అమితాబ్ బ‌చ్చ‌న్, షారుక్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, కపిల్ శ‌ర్మ లాంటి వారు కూడా వెనుక‌బ‌డిపోయారు. మ‌హిళా సెల‌బ్రిటీల్లో స‌న్నీదే టాప్ ప్లేస్. దీపికా ప‌దుకోన్, క‌త్రినా కైఫ్, బిపాషా బాసు లాంటి అంద‌గత్తెలంతా త‌ర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక పురుషుల విష‌యానికొస్తే…బాలీవుడ్ సుల్తాన్ స‌ల్మాన్ ఖాన్ ఫ‌స్ట్ ప్లేస్ సాధించాడు. క‌పిల్ శ‌ర్మ‌, అమితాబ్ బ‌చ్చ‌న్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ ..ఆ త‌ర్వాతి స్థానాల‌కు ప‌రిమిత‌మ‌య్యారు. పాలిటిక్స్ సెల‌బ్రిటీల విష‌యానికొస్తే ఎలాగూ మోడీని మించిన వారుండ‌రు. కానీ ఓవ‌రాల్ గా అన్ని కేట‌గిరీలు క‌లిపి… టాప్ పొజిష‌న్ కొట్టేసింది మాత్రం స‌న్నీ లియోన్ కావ‌డం విశేషం. ప్ర‌ధాని మోడీ కూడా స‌న్నీ త‌ర్వాతే నిలిచారు. ఇలా ఆమె ఫ‌స్ట్ ప్లేస్ లో నిల‌వ‌డం వ‌రుస‌గా ఐదో సారి కావ‌డం మ‌రో విశేషం.

మామూలుగా అయితే విమెన్ సెల‌బ్రిటీస్ లు ఒక ఏడాది టాప్ లో నిల‌వ‌డం క‌ష్టం. ఎందుకంటే ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త అందాలు తెర‌పైకి వ‌స్తుంటాయి. అలాంటిది వ‌రుస‌గా ఐదుసార్లు ఫ‌స్ట్ ప్లేస్ లో నిల‌వ‌డం మాట‌లు కాదు. పాపులారిటీని అలా ఏళ్ల‌పాటు నిల‌బెట్టుకోవ‌డం పెద్ద విశేష‌మే మ‌రి. నిజానికి స‌న్నీ లియోన్ కు అంత పాపులారిటీ రావ‌డానికి కార‌ణం ఆమె గ‌తంలో పోర్న్ స్టార్ కావ‌డం ఒక కార‌ణం కావ‌చ్చు. కానీ ఆ త‌ర్వాత ఆమె బాలీవుడ్ కు మారిన త‌ర్వాత కూడా అంత‌మంది అభిమానాన్ని పొందుతుందంటే…స‌న్నీని మెచ్చుకోక త‌ప్ప‌దు.

Leave a Reply