పంతుళ్లు నేతల దగ్గర ఎందుకు…సుప్రీం

0
345

 supreme court said pa ps teachers goto schools

పీఏ, పీఎస్‌లుగా పని చేస్తున్న ఉపాధ్యాయులు అక్టోబర్‌ 1 నుంచి విధుల్లో చేరాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రజాప్రతినిధుల వద్ద ఉపాధ్యాయులు పీఏ, పీఎస్‌లుగా కొనసాగేందుకు వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. ఇది చట్ట వ్యతిరేకమని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాల్లో వసతులు, ఉపాధ్యాయుల లేమిపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంలో ఈ రోజు విచారణ జరిగింది.

దీనిపై స్పందిస్తూ.. ఉపాధ్యాయులను వారంలోగా పాఠశాలలకు కేటాయించాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే ఈ ఏడాది పీఏ, పీఎస్‌లుగా కొనసాగేందుకు ఉపాధ్యాయులు గడువు కోరారు. ఉపాధ్యాయుల విజ్ఞప్తిని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ నాగప్పన్‌తో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. పిల్లల చదువులకు ఇబ్బందవుతుందని ఉపాధ్యాయులు అభ్యర్థించడంతో.. పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పీఏ, పీఎస్‌లుగా కొనసాగే విధానం దేశంలో ఉందా అని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఆ విధానం లేదని సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు.

Leave a Reply