టీ స్పీకర్ కి సుప్రీమ్ నోటీస్…ఆకర్ష్ కి షాక్

 supreme court sending notice telangana speaker madu sudhanaachari
ఆపరేషన్ ఆకర్ష్ తో విపక్షాలకు చెమటలు పట్టించిన అధికారపక్షానికి సుప్రీమ్ షాక్ ఇచ్చింది.తెలంగాణాలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీమ్ కోర్ట్ స్పందించింది. పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని అయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.ఈ పిటీషన్ పై విచారణ జరిపిన జస్టిస్ కురియన్ నేతృత్వంలోని ధర్మాసనం …పార్టీ పిరాయించిన వారితో పాటు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారికి నోటీసులు ఇచ్చింది.మూడు వారాల్లోగా సమాధానమివ్వాలని ఆదేశించింది.

సుప్రీమ్ ఆదేశాలతో వైసీపీ లోను జోష్ కనిపిస్తోంది.పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టం చేయాలని ఇప్పటికే ఆ పార్టీ పార్లమెంట్ వేదికగా పోరాటం చేస్తోంది.ఈ పరిణామం అధికారపక్షాల ఆపరేషన్ ఆకర్ష్ కి బ్రేకులేస్తుందని ఆ పార్టీ భావిస్తోంది .

SHARE