జంప్ జిలానీలకు సుప్రీం షాక్…

 Posted October 26, 2016

supreme court shocked to party changing mlaసుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ స్పీకర్ నవంబర్ 8లోగా తేల్చకపోతే మాత్రం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని స్పష్టమైన గడువు విధిస్తుందని, అప్పటికీ ఏ విషయమూ తేలకపోతే సుప్రీంకోర్టే వారిపై అనర్హత వేటు వేయడం కూడా తప్పకపోవచ్చని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ పార్టీల నుంచి 25 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఫిరాయించిన నేపథ్యంలో ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలు రావడం తప్పదని కాంగ్రెస్ భావిస్తోంది.

మరోవైపు ఇదే అంశం ఆంధ్రప్రదేశ్‌కు కూడా వర్తించే అవకాశం ఉంటుంది. అక్కడ సైతం వైఎస్ఆర్‌సీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం పార్టీలో చేరడం, వారిపై అనర్హత వేటు వేయాలంటూ ప్రతిపక్షం ఇచ్చిన ఫిర్యాదులను ఇంతవరకు పరిష్కరించకపోవడం తెలిసిందే.

SHARE