రివ్యూలపై రజినీ వ్యాఖ్యలు సమర్థనీయం కాదు : సురేష్‌బాబు

0
304
suresh babu comments on review against rajinikanth comment

Posted [relativedate]

suresh babu comments on review against rajinikanth comment
ఏ భాష సినిమా రిలీజ్‌ అయిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే వెబ్‌ మీడియాలో ఆ సినిమాకు సంబంధించిన రివ్యూలు పడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీ కారణంగా సినిమాకు వెళ్లాలి అనుకున్న ప్రేక్షకులు రివ్యూలను చూసి మరీ వెళ్తున్నాడు. ప్రస్తుతం ఉన్న సినిమాల్లో దేనికి ఎక్కువ రేటింగ్‌ ఇచ్చారో అని చూసిన తర్వాతే సినిమాకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ఫ్లాప్‌ సినిమాలకు రివ్యూల వల్ల భారీ నష్టం ఏర్పడుతుంది. అందుకే పెద్ద నిర్మాతలు మరియు బడా స్టార్స్‌ రివ్యూలపై ఎప్పటికప్పుడు అక్కస్సును వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఇటీవలే రజినీకాంత్‌ రివ్యూల వల్ల పెద్ద సినిమాలకు భారీ నష్టాలు వస్తున్నాయని, సినిమా విడుదలైన మూడు రోజుల తర్వాత రివ్యూలు రాయడం మంచిది అంటూ సలహా ఇచ్చాడు.

రజినీకాంత్‌ వ్యాఖ్యలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సినీ వర్గాల వారు కొందరు రజినీ వ్యాఖ్యలు పూర్తిగా సమర్థనీయం అని అంటున్నారు. అయితే కొందరు మాత్రం అది సాధ్యం కాదని, సాధ్యం కాని విషయాల గురించి మాట్లాడుకోవడం వృధా ప్రయాస అంటున్నారు. తాజాగా రజినీకాంత్‌ వ్యాఖ్యలపై సురేష్‌బాబు స్పందిస్తూ.. రివ్యూల వల్ల చిన్న సినిమాలకు ఉపయోగం. పెద్ద సినిమాలు నష్టపోతున్నాయి అంటే అది సరైన వాదన కాదు. సినిమా బాగుంటే తప్పకుండా మంచి రివ్యూలు వస్తాయి. బాగా లేకున్నా కలెక్షన్స్‌ రావాలి, రివ్యూల వల్ల కలెక్షన్స్‌ రావడం లేదు అనడం సమంజసం కాదని సురేష్‌బాబు చెప్పుకొచ్చారు. పెళ్లి చూపులు, ఘాజీ ఇంకా పలు చిన్న చిత్రాలు రివ్యూల కారణంగానే నడిచాయి అని, రివ్యూల వల్ల ఆ సినిమాలకు కోట్ల కలెక్షన్స్‌ వచ్చాయని చెప్పుకొచ్చాడు. రివ్యూలను విమర్శించడం కంటే మంచి సినిమాలు తీయడం పట్ల దృష్టి పెట్టడం మంచిదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply