ఆంధ్ర నుంచి రాజ్యసభ కు ఎన్నికైన రాష్ట్రేతర నాయకులతో పోలిస్తే కేంద్ర మంత్రి సురేష్ ప్రభు కాస్త నయం అనిపించుకుంటున్నారు .విశాఖ రైల్వే జోన్ అంశం తేల్చకపోయినా అమరావతి ఉద్యోగుల కోసం ,రాయల సీమ వాసుల కోసం రాజధాని కి రైళ్లు వేశారు .తాజాగా ఆయన తీసుకొన్న మరో నిర్ణయం రాష్ట్ర ప్రజానీకానికి ఊపిరి పోయబోతోంది .
సురేష్ ప్రభు తన ఎంపీ లాడ్స్ నుంచి 2.86 కోట్లు అత్యవసర వైద్య సేవల కోసం కేటాయించారు .ఈ నిధులతో ఆంధ్ర కు అవసరమైన అంబులెన్సులు కొనబోతున్నారు .వెంటిలేటర్ ,ఆక్సిజన్ సిలిండర్లు వంటి ప్రాణధార వైద్య వ్యవస్థ ఈ అంబులెన్సుల్లో ఉంటుంది .రోగులకు ఊపిరి పోసే నిర్ణయం తీసుకున్న సురేష్ ప్రభు కి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు .సురేష్ ప్రభు గారు ఆంధ్ర ప్రజల తరుపున మరో థాంక్స్ అందుకోండి ..