ఇక రైల్వే రిజర్వేషన్ కోసం సరి కొత్త యాప్ ..

Spread the love

Posted [relativedate]

suresh prabhu launched irctc rail connect app ఐఆర్‌సీటీసీ కొత్త మొబైల్ యాప్‌ను కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు మంగళవారం ప్రారంభించారు. ప్రయాణికులు ఇక సులువుగా సెల్‌ఫోన్ల నుంచే టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఆర్‌సీటీసీ కనెక్ట్‌ యాప్‌ను ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్‌గా అప్ డేట్ చేసినట్లు వివరించారు.

ఆండ్రాయిడ్ ఆధారిత ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్‌ యాప్‌లో పిన్ సెక్యూరిటీతో పాటు ఐఆర్‌సీటీసీ ఈ వాలెట్‌తో అనుసంధానం చేశారు. అంతేగాక 40 బ్యాంకులతో నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు పేటిఎం, పేయూ, మొబివిక్ వంటి పేమెంట్ గేట్లతో ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ ఎయిర్, ఫుడ్ ఆన్ ట్రాక్ మొబైల్ యాప్స్ కూడా ఈ కొత్త యాప్‌తో ఇంటర్ కనెక్ట్‌గా ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here