మెగా ఈవెంట్ కు సర్ ప్రెజ్ గెస్ట్..!

Image result for ktr ram charan

మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న ధ్రువ సినిమా రిలీజ్ కు ముందు భారీగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. డిసెంబర్ 4న యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో జరుగనున్న ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా తెలంగాణ మంత్రి కె.తారక రామారావు వస్తున్నట్టు సమాచారం. ప్రీ రిలీజ్ ఈవెంట్ పోలీస్ గ్రౌండ్ లో పెట్టడానికి కూడా ఇది పవర్ఫుల్ పోలీస్ కు సంబందించిన కథ కాబట్టి అక్కడ ఈవెంట్ ప్లాం చేశారట. ఇక ఈమధ్యనే 10 కె రన్ లో పాల్గొన్న చరణ్, కె.టి.ఆర్ లు ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నారు.

పర్సనల్ గా మంచి రిలేషన్ ఉండటంతో చరణ్ ధ్రువ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కె.టి.ఆర్ ను గెస్ట్ గా పిలిచాడట. దాదాపు కె.టి.ఆర్ రావడం కన్ఫామే అని తెలుస్తుంది. ఇక మెగా హీరోలు కూడా అటెండ్ అవుతారు కాబట్టి మెగా ఈవెంట్ మరో సంచలనం కానుంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఈవెంట్ లో పాల్గొనే అవకాశాలున్నాయట. అసలైతే ముందు విజయవాడలో ఆ తర్వాత వరంగల్ లో ప్రీ రిలీజ్ పెట్టాలని ఆలోచన చేయగా అది క్యాన్సిల్ అయ్యి పోలీస్ గ్రౌండ్స్ లో ఈవెంట్ చేస్తున్నారు. బ్రూస్ లీ తర్వార చరణ్ చేస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.