Posted [relativedate]
కాటమరాయడు.. ఇప్పుడు ఈ సినిమా పేరు ఓ సెన్సేషన్. గతంలో సినిమా కలెక్షన్స్ ని బట్టి హీరో సత్తాని, ఇమేజ్ ని కాల్యుక్యులేట్ చేసేవారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ ట్రెండ్ మారింది.. కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రిలీజయ్యే ట్రైలర్స్ కి, టీజర్స్ కి వచ్చే వ్యూస్ ని బట్టి ఆయా హీరోల రేంజ్ ఏంటి అనేది నిర్ధారిస్తున్నారు. ఈ విషయంలో కూడా పవన్ తన పవర్ చూపించి సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్ ని కూడా దున్నేస్తున్నాడని చెప్పవచ్చు. ఇటీవల విడుదలైన కాటమరాయుడు ట్రైలరే ఇందుకు ఉదాహరణ. కాగా ఆడంబరాలకు, అట్టహాసాలకు పోని పవర్ స్టార్.. ఈ సారి మాత్రం కాటమరాయుడు ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించనున్నాడు. అందుకు ఓ బలమైన కారణం ఉందని అతని సన్నిహితులు చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కి వచ్చి గత అక్టోబర్ తో 20 యేళ్లు పూర్తయ్యింది. ఆ ఈవెంట్‌ని కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ తో కలిపి నిర్వహించనున్నాడట పవన్. అక్టోబరు నుంచి ఇప్పటి వరకూ పవన్‌కి సంబంధించిన సినిమా ఫంక్షన్ ఏం జరగలేదు. అందుకే కాటమరాయుడులో పవన్ 20 ఇయర్స్ సెలబ్రేషన్ చేయాలని భావిస్తోంది చిత్రబృందం. నిజానికి ఈ ఈవెంట్‌ని చాలా గ్రాండ్ గా, స్పెషల్ ఈవెంట్ లా ప్లాన్ చేశాడట శరత్ మరార్. కానీ సింపుల్ సిటీని ఇష్టపడే పవన్ గ్రాండ్ గా కాకుండా, ప్రీ రిలీజ్ ఫంక్షన్ తో పాటు కలిపి చేసేయండి అని చెప్పాడట. దీంతో ఈ రెండు వేడుకల్నీ కలిపి ఈనెల 18న హైదరాబాద్ లో శిల్పకళావేదికలో నిర్వహించనున్నారని సమాచారం. ఒక్క ఈవెంట్ అంటేనే పండగ చేసుకునే పవన్ అభిమానులు ఈ సడెన్ సర్ ప్రైజ్ దొరకడంతో తెగ సంబరపడిపోతున్నారు.