టీకాంగ్రెస్ లో చిచ్చు పెట్టిన స‌ర్వే!!!

0
281
survey leads to clashes in telanga congress party

Posted [relativedate]

survey leads to clashes in telanga congress partyఅసలే టీ. కాంగ్రెస్ లో ఇంట‌ర్న‌ల్ వార్ న‌డుస్తోందంటే.. తాజాగా స‌ర్వే ఫ‌లితాలంటూ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ చేసిన ప్ర‌క‌ట‌న అగ్నికి ఆజ్యం పోసింది. టీపీసీసీ ఆధ్వ‌ర్యంలో ఓ స‌ర్వే చేశామ‌ని చెప్పిన కాంగ్రెస్ కు 55 స్థానాలు గ్యారెంటీ అని చెప్పుకొచ్చారు. అయితే ఓడిపోయే స్థానాలు కూడా ప్ర‌క‌టించేశారు. ఇదే ఇప్పుడు ర‌చ్చ‌కు కార‌ణ‌మైంది.

కాంగ్రెస్ నాయ‌కులు బ‌లంగా ఉన్న‌చోట కూడా పార్టీ ఓడిపోతుంద‌ని ఉత్త‌మ్ ప్ర‌క‌టించారు. దీంతో అక్క‌డి నాయ‌కులు ఇప్పుడు ఉత్త‌మ్ పై కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఇక న‌ల్ల‌గొండ జిల్లాలో అయితే న‌కిరేక‌ల్, భువ‌న‌గిరి సీట్లు క‌ష్ట‌మేన‌ని ఉత్త‌మ్ ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ తో ఆయ‌న‌కున్న పోరు మ‌రింత తీవ్ర‌మైంది. ఎందుకంటే ఈ స్థానాల్లో కోమ‌టిరెడ్డి సోద‌రుల హ‌వా ఎక్కువ‌గా న‌డుస్తుంది. నిజానికి ఈ రెండుస్థానాల్లోనూ కాంగ్రెస్ బ‌లంగా ఉంది. అయినా ఉత్త‌మ్ మాత్రం అలా ప్ర‌క‌టించ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే.

ఒక్క కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ విష‌యంలోనే కాకుండా మిగ‌తా జిల్లాల్లోనూ మాజీ మంత్రులు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ ఓడిపోతుంద‌ని ఉత్త‌మ్ ప్ర‌క‌టించారు. దీంతో వారంతా ఉత్త‌మ్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఏ ప్రాతిప‌దిక‌న ఇలాంటి స‌ర్వే చేశార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. పార్టీ శ్రేణుల నైతిక స్థైర్యం దెబ్బ‌తీయ‌డానికే ఈ స‌ర్వేనా అని మండిప‌డుతున్నారు.

ఈ స‌ర్వే ఫ‌లితాల‌పై జానారెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నార‌ట‌. స‌మ‌యం కాని స‌మ‌యంలో ఈ స‌ర్వే ఏంట‌ని ఉత్త‌మ్ పై పెద్దాయ‌న మండిప‌డిన‌ట్టు టాక్. అటు హైక‌మాండ్ కూడా ఉత్త‌మ్ కు త‌లంటిన‌ట్టు స‌మాచారం. మొత్తానికి స‌ర్వే పెట్టిన చిచ్చు ఎంతవ‌ర‌కు వెళ్తుందోన‌ని కాంగ్రెస్ నాయ‌కులు ఆందోళ‌న చెందుతున్నారు!!!

Leave a Reply