సావిత్రి సినిమాలో సూర్య..

 Posted March 23, 2017

surya as sivaji ganesan role in savitri biopic movieమహానటి సావిత్రి బయోపిక్ తీయనున్నట్లు నాగ్ అశ్విన్ ఎప్పుడో ప్రకటించినా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన దర్శకుడు రీసెంట్ గా కీర్తి సురేష్, సమంతలను హీరోయిన్స్ గా ఫైనలైజ్ చేశాడు. తాజాగా ఈ సినిమాలో తమిళ్ హీరో సూర్యని నటింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

త‌మిళ‌నాట కూడా మహానటి సావిత్రి పాపుల‌రే… కాబట్టి ఈ సినిమాను అక్కడ కూడా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట నిర్మాత అశ్వినీదత్. ఇందులో భాగంగానే హీరో సూర్యని శివాజీ గ‌ణేష‌న్ పాత్రలో నటింపజేయాలని నిర్ణయించారు. అయితే  సావిత్రి బయోపిక్ ని యదార్ధంగా తెరకెక్కించాల్సి వస్తే శివాజీగ‌ణేశ‌న్‌ ని కాస్త నెగిటీవ్‌ గా చూపించాల్సివుంటుందని చిత్రయూనిట్ చెబుతోంది. కానీ కోలీవుడ్ లో శివాజీగ‌ణేశ‌న్‌ ని నెగిటీవ్‌గా చూపిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు. అది తన కెరీర్ పై కూడా పడుతుందని భావించిన  సూర్య… కధలో కొన్ని మార్పులు చెప్పాడట. ఆ మార్పులు చేస్తే తనకు నటించడానికి ఏ అభ్యంతరం లేదని స్పష్టం చేశాడట. అయితే ఆ మార్పులు చేస్తే కధలో రియాలిటీ దెబ్బతింటుంది. కాబట్టి   నాగ్ అశ్విన్ ఆ మార్పులు చేస్తాడో లేదో చూడాలి మరి.

SHARE