రజనికి సూర్య తండ్రి సాయం..

 Posted October 31, 2016

surya father siva kumar help to rajinikanth
ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండటం ఎలాగో సూపర్ స్టార్ రజని కాంత్ ని చూసి నేర్చుకోవచ్చు.ఒక స్థాయి దాటిన తర్వాత కళ్ళు నెత్తికెక్కడం చిత్ర పరిశ్రమలో సాధారణంగా కనిపిస్తుంటుంది.తమ ఒప్పులే గానీ తప్పులు బయట ప్రపంచానికి కనపడకుండా చుట్టూ ఓ దడి కట్టుకుంటారు సినీ ప్రముఖులు.కానీ రజని అలా కాదని చెప్పేందుకు ఇది మరో ఉదాహరణ.ఇటీవల నటుడు సూర్య తండ్రి శివకుమార్ 75 ఏళ్ల జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.అమెరికాలో ఉన్నందున ఆ కార్యక్రమానికి రాలేకపోయిన రజని శుభాకాంక్షలు చెబుతూ ఓ లేఖ పంపారు.

ఒకప్పుడు తనతో కలిసి నటించిన శివకుమార్ కి రాసిన లేఖలో రజని ప్రస్తావించిన విషయమేంటో తెలుసా? ఒకప్పుడు మద్యం,ధూమపానం చేసే అలవాటున్న తనకి దాని వల్ల నష్టం జరుగుతుందని హెచ్చరించి ఆరోగ్యం కాపాడుకోవడం గురించి సూచనలు చేశారట శివకుమార్. అయన వల్లే తాను ఆ దుర్వ్యసనాలకు దూరమై శారీరక,మానసిక శక్తిని కూడగట్టుకున్నట్టు రజని ఆ లేఖలో రాశారు.ప్రపంచానికి తెలుస్తుందని అర్ధమైన తన బలహీనతని,ఎదుటి మనిషి గొప్పదనాన్ని చాటిచెప్పడం రజనీకాంత్ కే చెల్లింది.ఈ ప్రపంచంలో ఎంతమంది ఎందరికి తాగుడు వద్దని చెప్పడం లేదు?వాళ్లంతా మానేస్తున్నారా?మానేసిన వాళ్ళు హితబోధ చేసినోళ్లకి క్రెడిట్ ఇస్తున్నారా? ఇదండీ రజని కి సూర్య తండ్రి చేసిన సాయం..అందుకు సూపర్ స్టార్ కృతజ్ఞత చెప్పిన తీరు .

SHARE