Posted [relativedate]
సాధారణంగా సినిమా అంటే ఓ 60 నుండి 80 సీన్స్ రాసుకుంటారు. ఇంకా పెంచాలనుకుంటే 100కి అటు ఇటు కానిచ్చేస్తారు. అయితే కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య నటించిన సింగం సీరీస్ ఎస్-3లో మాత్రం ఏకంగా 365 సీన్స్ ఉన్నాయట. ఏంటి ఒక్క సినిమాలో 365 సన్నివేశాలా అని షాక్ అవ్వొచ్చు. హరి డైరక్షన్లో వస్తున్న ఈ సినిమాలో నిజంగా 365 సీన్స్ రాసుకున్నాడట.
తమిళ దర్శకుడు హరి సినిమాల్లోని సన్నివేశాలు చాలా షార్ప్ గా ఉంటాయి. ఒక సీన్ కట్ చేసిన వెంటనే మరో సీన్ దాని తర్వాత మరోటి ఇలా కంటిన్యూస్ గా షార్ప్ గా సీన్స్ రాసుకుంటాడు. అందుకే ఆయన సినిమాలు ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ అందిస్తుంటాయి. ఈ క్రమంలో సూర్య ఎస్-3కి అదే తరహాలో 365 సీన్స్ రాశాడట. పవర్ ఫుల్ పోలీస్ గా కనిపిస్తున్న సూర్య ముందు వచ్చిన రెండు సినిమాల కథల కన్నా ఈ సినిమా మీద ఎక్కువ నమ్మకంతో ఉన్నారు.
సూర్యకు తెలుగులో ఉన్న మార్కెట్ పరంగా ఈ సినిమాను తెలుగులో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయాలని చూస్తున్నారు. తెలుగులో ఆడియో రిలీజ్ ప్లాన్ చేసినా కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ చేయలేదు. అందుకే డైరెక్ట్ గా మార్కెట్ లోకి ఆడియో వచ్చేస్తుందట.