సింగం-4 కూడా వస్తుందట..!!

0
412
surya planning about singham4

Posted [relativedate]

surya planning about singham4సూర్య నటించిన సింగం సిరీస్ లోని మూడు సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ ను సాధించాయో తెలిసిన విషయమే. ఈ సింగం సిరీస్ తో సూర్య కోలీవుడ్ లో తన  స్థానాన్ని సుస్ధిరం చేసుకున్నాడు. కాగా సింగం-1, సింగం-2 అందుకున్న రేంజ్ ని సింగం-3 టచ్ చేయలేకపోయినా మంచి కలెక్షన్లను మాత్రం రాబడుతోంది. దీంతో ఈ సినిమా దర్శకుడు సింగం-4 కూడా తెరకెక్కిస్తామని ప్రకటించాడు. అయితే సింగం-4 సెట్స్ పైకి వెళ్ల‌డానికి దాదాపు నాలుగైదేళ్ల  స‌మ‌యం ప‌డుతుంద‌ని  స్ప‌ష్టం చేశాడు.

తాను సామి-2 సినిమాలో బిజీగా ఉన్నానని, అలాగే సూర్య కూడా వేరే ప్రాజెక్ట్స్ కి కమిట్ అయ్యాడని తెలిపాడు. ఈ అడ్డంకులన్నీ పోడానికి కనీసం నాలుగు సంవత్సరాలు పడుతుందని, ఈ లోగా సింగం-4` కు కావాల్సిన క‌థ‌ను రెడీ చేస్తానని  వివరించాడు. సింగం-3 నే తెలుగు రాష్ట్రాల్లో సరిగ్గా గర్జించలేకపోతే ఇక  సింగం-4.. అదీ నాలుగు సంవత్సరాల తర్వాత… సూర్య  ఏంచేస్తాడో చూడాలి.

Leave a Reply