తమిళ సూపర్ స్టార్ ‘సూర్య’ పేరు తెలియని వారుండరు, తను ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తూ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ అని అనిపించుకుంటున్నాడు. తను ఎంతమంచోడు అంటే ఎవరైనా భాద పడినా,ఆపదలో కన్పించినా వారికి సహాయం చేసిన దాకా నిద్రపోడు అందుకే సూర్య అంటే అందరు ఇష్టపడతారు, సొంతం గా ‘అగరం’ అనే ఫౌండేషన్ పెట్టి దాని ద్వారా ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తున్నాడు.
తన మంచితనం గురించి చెప్పాలి అంటే … ఒకరోజు ఒక మూవీ షూటింగ్ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్తున్న సూర్యకి, ఒక పెద్దావిడా యాక్సిడెంట్ అయ్యి రోడ్ పక్కన పడివుంటే ఎంతో రిస్కు తీస్కోని ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేసి డబ్బులు ఇచ్చి మరీ వెళ్ళాడు,
ఒకరోజు కారులో వెళ్తుండగా ఇద్దరు కుర్రోళ్ళు ఒక ఆడమనిషిని,కొడుతూ ఏడిపిస్తుంటే ఆ దృశ్యాన్ని చూసి వెళ్ళిపోకుండా వాళ్ళను మందలించి ,బుద్ది చెప్పి వెళ్ళాడు.
ఇప్పుడు చెప్పండి సూర్యా కొట్టడం మంచిదే కదా… ఆడవాళ్ళను గౌరవించడంలో , ఇతరులకు సేవచేయటం లో మనం సూర్యా ని ఆదర్శంగా తీసుకోవాలి.