సూర్యకు షాక్ ఇచ్చిన వార్ధా తుఫాన్..!

0
696
Surya S-3 Post Poned For Vardha Effect

Posted [relativedate]

Surya S-3 Post Poned For Vardha Effectఓ పక్క సౌత్ సినిమాను కుదిపేస్తున్న నోట్ల కష్టాలు తీరకముందే కోలీవుడ్ లో రీసెంట్ గా వచ్చిన వార్ధా తుఫానికి అక్కడి సినిమాలు రిలీజ్ కష్టాలు పడాల్సి వస్తుంది. చెన్నై పరిసర ప్రాంతాల్లో వార్ధా తుఫాన్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అయితే నోట్ల కష్టాల వల్ల తెలుగులో సినిమా కలక్షన్స్ పర్వాలేదు కాని తమిళంలో మాత్రం పరిస్థితి కష్టంగానే ఉంది. ఆ నోట్ల కష్టాలే ఉన్న సరే తెగించి రిలీజ్ చేద్దామనుకున్న సూర్య ఎస్-3 వార్ధా తుఫాన్ వచ్చేసరికి ఆలోచనలో పడ్డాడు.

అసలైతే దీవాళికి రిలీజ్ చేయాలనుకున్న ఎస్-3 ను డిసెంబర్ 16 కు పోస్ట్ పోన్ చేశారు. దీవాళికి తమ్ముడు కాష్మోరాకు అడ్డు రాకూడదని సూర్య ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక డిసెంబర్ 9న రిలీజ్ అయిన ధ్రువ సినిమాకు అడ్డు ఎందుకని రిలీజ్ ను డిసెంబర్ 23కి పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ డేట్ కు రావడం కష్టమే అని తెలుస్తుంది. తమిళనాడులో పరిస్థితి కాస్త ఇబ్బందిగా ఉన్న కారణం చేత దర్శక నిర్మాతలు సినిమాను మళ్లీ వాయిదా వేయాలని చూస్తున్నారట.

అఫిషియల్ గా తెలియలేదు కాని సూర్య సినిమా దాదాపు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. సింగం సీరీస్ లలో మూడో భాగంగా వచ్చిన ఎస్-3 మూవీ తెలుగు తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూశారు. అనుష్క శృతి హాసన్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా హరి డైరక్షన్ లో వస్తుంది.

Leave a Reply