దుమ్మురేపుతున్న సూర్య ఎస్-౩ టీజర్

Posted November 9, 2016

s311సౌత్ లో సూపర్ హీరో అంటే కచ్చితంగా హీరో సూర్య పేరే వినపడుతుంది. కేవలం కమర్షియల్ సినిమాలే కాదు విలక్షణమైన పాత్రల్లో కూడా సూర్య తన సత్తా చాటాడు చాటుతున్నాడు. ఈ ఇయర్ 24తో ప్రేక్షకులను టైం మిషన్ లో బంధించిన సూర్య ఇప్పుడు సింగం సీరీస్ లతో రాబోతున్నాడు. యముడు 3 గా వస్తున్న ఈ సినిమా టీజర్ రెండు రోజుల క్రితం రిలీజ్ అయ్యింది. పవర్ఫుల్ పోలీస్ గా సూర్య మరోసారి తన ఉగ్ర రూపాన్ని చూపించాడు.

అయితే ఈ టీజర్ తో రజిని కబాలి రికార్డ్ తో పోటీ పడుతున్నాడు సూర్య. రిలీజ్ అయిన రెండో రోజుల్లోనే 40 లక్షల వ్యూయర్స్ తో టీజర్ తోనే తన స్టామినా ఏంటో చూపిస్తున్నాడు సూర్య. తెలుగు టీజర్ కూడా 1 మిలియన్ వ్యూయర్ కౌంట్ దగ్గరపడింది. ఇక ఇదే ఫాంతో కబాలి రికార్డును సైతం సూర్య క్రాస్ చేసేలా ఉన్నాడు.

హరి డైరక్షన్లో వస్తున్న ఈ సినిమాలో అనుష్క, శృతి హాసన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరి టీజర్ తో దుమ్మురేపుతున్న సూర్య సినిమాతో ఎలాంటి సంచలనాలను సృష్టిస్తాడో చూడాలి. డిసెంబర్ 19న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అటు కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

[wpdevart_youtube]7JB_L5uqmB0[/wpdevart_youtube]

SHARE