సింగం-3 వచ్చేశాడోచ్..!!

0
288
surya singam 3 now in theaters

Posted [relativedate]

surya singam 3 now in theatersసూర్య హీరోగా నటించిన సింగం, సింగం-2 ఎంత సెన్సేషన్ ని క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ  సెన్సేషన్ సినిమాలకి సీక్వెల్ గా  రూపొందిన సింగం-3 రిలీజ్ ఉందా లేదా అన్న సస్పెన్స్ కూడా అదే రేంజ్ లో కొనసాగింది. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ రోజు రిలీజ్ పక్కా అని చెప్పినట్లుగానే ఈ ఉదయం తమిళనాడులో సింగం-3 విడుదల అయినా  తెలుగు రాష్ట్రాల విషయంలో మాత్రం కాస్త గందరగోళం నెలకొంది.

సాంకేతిక కారణాలతో తెలుగులో విడుదల వాయిదా పడ్డట్టు  వార్తలు వచ్చినా, అన్ని అవరోధాలను అధిగమించి సింగం-3 మధ్యాహ్నానికి  ప్రేక్షకుల ముందు ప్రత్యక్షమయ్యాడు. హైదారాబాద్ లోని పలు ధియేటర్లలో మధ్యాహ్నం 12 గంటలకు షో మొదలవ్వడంతో సూర్య అభిమానులు కాస్త కుదుటపడ్డారు.

Leave a Reply