అక్కినేని ఇంట మరో విషాదం.. ఆ వేడుక రద్దు

0
458
Sushanth Father Sathya Bhushana Rao Passed Away

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Sushanth Father Sathya Bhushana Rao Passed Awayఅక్కినేని నాగార్జున రెండవ సోదరి నాగసుశీల భర్త సూర్యభూషణ రావు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందాడు. హీరో సుశాంత్‌ తండ్రి సూర్యభూషణ రావు. దాదాపు రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తెల్లవారు సమయంలో తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ వార్త తెలిసిన వెంటనే అక్కినేని ఫ్యామిలీ శోఖ సంద్రంలో ముగిని పోయింది. 68 సంవత్సరాల వయస్సులో సూర్య భూషణ రావు తిరిగి రాని లోకాలకు వెళ్లడం అందరిని కలిచి వేస్తుంది.

కొడుకును హీరోగా చూడాలని కోరుకున్న సూర్య భూషణ రావు, ఆ కొడుకు సక్సెస్‌ఫుల్‌ హీరోగా కాకుండానే మరణించాడు. ఈయన మృతిపట్ల టాలీవుడ్‌ వర్గాల వారు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సూర్యభూషణ రావు మరణించిన కారణంగా నేడు సాయంత్రం జరగాల్సిన నాగచైతన్య ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమా ఆడియో వేడుకను రద్దు చేయడం జరిగింది. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో నిర్మించిన ఈ సినిమాకు కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించగా చైతూకు జోడీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించిన విషయం తెల్సిందే. ఈ సంఘటనతో ఆడియో వేడుక పూర్తిగా రద్దు చేసి పాటలను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేసే అవకాశాలున్నాయి. సినిమాను ఈనెల 26న విడుదల చేయబోతున్నారు.

Leave a Reply