సాయమే కాదు షాక్ లు ఇస్తున్న సుష్మా…

0
418

  sushma swaraj doing help same time giving shocks

ఈ మధ్య కాలంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను ట్విట్టర్ ద్వారా సమస్యల పరిష్కారం కోరడం ఎక్కువయిపోయింది. పాకిస్థాన్ కు చెందిన ఓ మెడికల్ స్టూడెంట్ కు ఆమె సాయపడడం, ఓ ముస్లిం జంటను కలపడంలో ఆమె సహకరించడం .. ఇవన్నీ చూసి ఓ కుర్రాడికి ఆమెను టీజ్ చెయ్యాలనిపించింది.. అంతే.. “ నా కొత్త కారు పాడయిపోయింది, పొగ వస్తోంది, షాపు తీసికెళితే వాడు రీప్లేస్ చేయనంటున్నాడు.. నన్నేం చేయమంటారు, మీరో మాట చెబితే నాకు చాలా ఉపయోగపడుతుంది” అని ట్విట్టర్ లో సుష్మకు మెసేజ్ పంపాడు..

కారు పక్కన తాను నిలబడి ఉన్న ఫోటోలనూ జతచేశాడు.ఆమె ఊరుకుంటారా…. వెంటనే పది నిమిషాల్లో రిప్లై పంపించారు.. అది చూసి ఆ కుర్రాడు అవాక్కయ్యాడు.. నేనేం చేయగలను నాయనా.. నీ కారు పనిచేయకపోతే షెడ్డుకు తీసికెళ్ళు.. నాకు చాలా పన్లున్నాయి.. అని సుష్మ బదులిచ్చారు. అంతే ఆ కుర్రాడి నోట మాట రాలేదు.

Leave a Reply